భారతదేశ కోహినూర్ కోసం... రతన్ టాటా డైమండ్ వీడియో వైరల్!

ఆన్ లైన్ వేదికగా దేశ ప్రజానికం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది.

Update: 2024-10-14 02:30 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అక్టోబర్ 9 బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ముంబైలోని ఆసుపత్రిలో తన 86వ ఏట మృతి కనుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారదేశ పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన అపారమైన కృషిని తలచుకుంటూ దేశం మొత్తం ఆయనకు సంతాపం తెలిపింది.

ఆన్ లైన్ వేదికగా దేశ ప్రజానికం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా అద్భుతమైన డైమండ్ చిత్రపటం వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో దీని క్రియేటర్ అద్భుతమైన ప్రశంసలు పొందుతున్నారు.

సూరత్ లోని ఒక ఆభరణాల వ్యాపారి సుమారు 11,000 వజ్రాలను ఉపయోగించి టాటా సారూప్యతను ప్రదర్శించారు. సమాజ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తికి తగిన నివాళిగా ఈ పనికి పూనుకున్నారు! దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది.

దీంతో... దేశ ప్రజల జీవితాలపై రతన్ టాటా చూపిన ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని అంటున్నారు నెటిజన్లు. ఈ సందర్భంగా స్పందించిన నెటిజన్లు తమ తమ మనసులో మాటలు కామెంట్స్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఇందులో భాగంగా.. "రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త కాదు.. అతను చాలా మందికి ఆశాజ్యోతిగా ఉన్నారు" అని ఒకరు కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా... "ఈ నివాళి నిజంగా అతని వారసత్వలాగా ఓ అద్భుత కళాఖండం" అని వర్ణించాడు. ఇదే క్రమంలో.. "ఇంత గొప్ప వ్యక్తిని గుర్తించుకోవడం ఎంతో అందమైన విషయమని.. ఈ చిత్రపటం ఈ ప్రపంచానికి కాంతిని తెచ్చిన వ్యక్తిని సరిగ్గా సరిపోతుంది" అని మరొకరు కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ డైమండ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

Tags:    

Similar News