రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు
మరోవైపు.. చిన్నచిన్న సంస్థలను అందులోనూ ప్రధానంగా స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
దేశీయ మార్కెట్లో విలువ పరంగా అతిపెద్దది టాటా గ్రూప్ అనే చెప్పాలి. దీనిని దిగ్విజయంగా దశాబ్దాలుగా ముందుకు నడిపిస్తున్న ఘనత మాజీ చైర్మన్ రతన్ టాటాకే చెందుతుంది. సంస్థల చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న రతన్ టాటా.. చారిటబుల్ ట్రస్టులకు నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. మరోవైపు.. చిన్నచిన్న సంస్థలను అందులోనూ ప్రధానంగా స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
భారత దిగ్గజ వ్యాపారవేత్తగా రతన్ టాటా పేరుగాంచారు. పేదల కారు కలను సాకారం చేసేందుకు కేవలం లక్ష రూపాయలతో కారును తయారుచేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. దాంతో పేదల కారు కల కొంతవరకు సాకారం అయింది. ఆ కారుకు సైతం పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఇక.. రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యం రోజురోజుకూ విస్తరిస్తూ వచ్చింది. ఎంతోమందికి ఆయన ఉపాధినిచ్చారు. కొత్తగా తయారైన ఇంజినీర్లకు అండై నిలిచారు.
ఎంతో మంది దేవుడిలా భావించే రతన్ టాటా.. ఇప్పుడు అనారోగ్యం బారిన పడ్డారు. ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆకస్మా్త్తుగా అస్వస్థతకు గురయ్యారు. 86 ఏళ్ల వయసున్న రతన్ టాటా ఆరోగ్యం పరిస్థితి విషమంలో ఉండడంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు.. రతన్ టాటా అనారోగ్యం బారిన పడడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అనారోగ్యం నుంచి తొరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.