రూ.120 కోట్లు : స్క్రాపే కదా అని తీసేయకండి
రవి కానా, అతని గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాను థాయిలాండ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
స్క్రాప్ మెటల్ మాఫియా నడిపే రవి కానా అనే వ్యక్తికి చెందిన, అతని సన్నిహితుల రూ.120 కోట్లు సీజ్ చేశారు. స్క్రాప్ దందా చేసే అతను తన ప్రియురాలు కాజల్ ఝాకు రూ.100 కోట్ల విలువైన భవనాన్ని కానుకగా ఇవ్వడం విశేషం.
రవి కానా, అతని గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాను థాయిలాండ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ కానా చాన్నాళ్ల నుంచి పాత ఇనుప సామన్ల దందాలో చేస్తున్నాడు.
స్క్రాప్ డీలర్‌గా కానా చాలా సంపాదించి మిలియనీర్ అయ్యాడు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ గ్యాంగ్‌స్టర్‌పై మొత్తం 11 కేసులు రిజిస్టర్ చేశారు. ఇందులో కిడ్నాప్, దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. దీంతో కఠినమైన యూపీ గ్యాంగ్‌స్టర్ చట్టం కింద రవి కానాపై కేసులు బుక్ చేశారు. అతనిపై గ్రేటర్ నోయిడాలో పోలీసు ఫిర్యాదు నమోదు అయ్యింది. అతనికి 16 మంది సభ్యుల గ్యాంగ్ ఉన్నది. వాళ్లంతా స్క్రాప్ మెటల్ దందా చేస్తుంటారు.
గ్యాంగ్‌లోని ఆరుగుర్ని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు గ్రేటర్ నోయిడాలో ఉన్న పలు స్క్రాప్ గోడౌన్లను సీజ్ చేశారు.
ఒకప్పుడు ఉద్యోగం కోసం కానా వద్దకు వెళ్లిన కాజల్ ఆ తర్వాత అతని గ్యాంగ్‌లో సభ్యురాలైంది. కానాకు బినామీ ఆస్తులకు చెందిన లావాదేవీలను కాజల్ చూసుకునేది.
అతని కోసం అన్వేషిస్తున్న నోయిడా పోలీసులు థాయిలాండ్ పోలీసులతో నిత్యం టచ్‌లో ఉన్నారు. జనవరిలో అతని కోసం రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు. తాజాగా కానాను ప్రియురాలితో సహా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.