రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన షెడ్యూల్ ఇదే!

అవును... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (ఆగస్టు 3) విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు.

Update: 2024-08-03 03:59 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం ఆయన అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ నెల 14వరకూ కొనసాగనున్న ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఐటీ-పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.

అవును... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (ఆగస్టు 3) విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. మరోవైపు ఈ నెల 4న మంత్రి శ్రీధర్ బాబు, 5న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు! వీరంతా కలిసి 9వ తేదీ వరకూ వాషింగ్టన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, డల్లాస్ నగరల్లో పర్యటించి పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.

ఇదే క్రమంలో అగ్రరాజ్యంలో ఉన్న పలువురు ప్రవాస భారతీయులతోనూ రేవంత్ సమావేశమవుతారు. ఇక 10 వరకూ యూఎస్ లో ఉండి, అదేరోజు అక్కడ నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరానికి చేరుకుంటారు. అక్కడా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు.

ఇలా అమెరికా, సౌత్ కొరియా పర్యటనలు ముగించుకుని ఈ నెల 14న తిరిగి రాష్ట్రానికి రానున్నారు రేవంత్ & కో! కాగా... రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనవరి 15 నుంచి 19 వరకూ స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే.

సీఎం షెడ్యూల్ ఇదే!:

3వ తేదీన హైదరాబాద్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు చేరుకున్న అనంతరం 4న న్యూజెర్సీలోని ఓ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం రేవంత్. ఇక 5వ తేదీన అదే రాష్ట్రంలోని కాగ్నిజెంట్ సీఈవో, ఆర్.సీ.ఎం., టీబీసీ, జోయిటస్, కార్నింగ్ సంస్థల ప్రతినిధులతో పాటు సిగ్నా సీనియర్ ఆఫిసర్, ఆర్గా సీఈవో, పీ & వో కంపెనీ సీవోవో మొదలైన వారితో భేటీ అవుతారు.

ఇక 6వ తేదీన హెచ్.సీ.ఏ., పెప్సికో ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత వాషింగ్టన్ చేరుకుని అక్కడ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్ కు వెళ్లి 7న ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మగాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శ్సన అనంతరం.. ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టెబుల్ సమావేశంలో పాల్గొంటారు! ఇక 8న పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు.

ఇందులో భాగంగా... ఆరమ్, అమ్ జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో పాటు ట్రినెట్ సీఈవో తో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతోనూ రౌండ్ టేబుల్ సమావేశంలో పాలొంటారు. ఈ నేపథ్యంలోనే 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.

అదేరోజు... అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈవో, మోనార్క్ ట్రాక్టర్స్, ఎనోవిక్స్, థెర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలుస్తారు. ఇక 10 న అక్కడ నుంచి బయలుదేరి, 11న సియోల్ చేరుకుంటారు. 12న కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ, యూయూ ఫార్మా, హ్యూండాయ్ మోటార్స్ ప్రతినిధులతోనూ భేటీ అవుతారు.

ఇక 13న సామ్ సంగ్, ఎల్.జీ. సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం.. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఈ నెల 14న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.

Tags:    

Similar News