మాట నిలబెట్టుకుంటూ రేర్ క్వాలిటీ ప్రదర్శించిన రేవంత్

ఏ ప్రశ్నకు అయినా ఠకీమని సమాధానం చెప్పే రేవంత్.. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎలాంటి తడబాటుకు గురి కాకుండా మాట్లాడటం ఒక రేర్ క్వాలిటీగా చెప్పాలి.

Update: 2024-01-07 04:23 GMT

రాజకీయ నేతల నోటి మాటలు నీటి మూటలతో సమానంగా చెబుతారు. ఇక.. వారు ఇచ్చే హామీల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం ఉంది. అయితే.. అలాంటి తీరుకు తాను భిన్నమన్న విషయాన్ని మాటలతోనే కాదు చేతలతోనూ తప్పని ప్రూవ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టి.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఆయన.. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

ఎన్నికల ప్రచారంలో ఒక ప్రైవేటు చానల్ కు ఇంటర్వ్యూకు వెళ్లిన ఆయన.. ఆ చానల్ అధినేతతో జరిగిన బిగ్ డిబేట్ లో.. తాను ఎన్నికల్లో గెలుస్తామని.. ముఖ్యమంత్రిగా వచ్చి మొదటి ఇంటర్వ్యూ ఇస్తానన్న మాటకు కట్టబడి.. చెప్పినట్లే 30 రోజులకు సదరు చానల్ అధినేత ఇంట్లో ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సాధారణంగా చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉండదు.

అందునా.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. అది కూడా ఒక సంపన్న రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించే వేళలో.. ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. కానీ.. అందుకు భిన్నంగా రేవంత్ ధోరణి ఉంది. అంతేకాదు.. సీఎం కాక ముందు ఎలా అయితే.. ఏ ప్రశ్నకు అయినా ఠకీమని సమాధానం చెప్పే రేవంత్.. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎలాంటి తడబాటుకు గురి కాకుండా మాట్లాడటం ఒక రేర్ క్వాలిటీగా చెప్పాలి.

సాధారణంగా అత్యున్నత స్థానాల్లో చేరుకున్నప్పుడు.. నోటి నుంచి వచ్చే మాటలు చాలా ఆచితూచి అన్నట్లుగా రావటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా ఎప్పటి రేవంత్ మాదిరే సీఎం రేవంత్ మాటల తీరు ఉందని.. ఏ మాత్రం తేడా లేకుండా ఉండటం అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. అంతేకాదు.. భోళాగా.. మనసులో ఉన్నది దాచుకోకుండా.. తాను చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని చెప్పేయటమేకాదు.. ఇంటర్వ్యూ చేసే చానల్ అధినేత అడిగే ప్రశ్నలకు తడబాటు అన్నది లేకుండా సమాధానాలు ఇచ్చిన తీరుతో రేవంత్ అంటే ఏమిటి? అన్న విషయం మరోసారి అర్థమయ్యేలా చేసుకున్నారని చెబుతున్నారు. చివర్లో సదరు చానల్ అధినేత అడగకున్నా.. తాను వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్ని అమలు చేసి మళ్లీ.. ఇంటర్వ్యూకు వస్తానని.. ఆ రోజున తమ ప్రభుత్వానికి రేటింగ్ ఇవ్వాలని కోరటం గమనార్హం. మొత్తంగా ప్రతిపక్ష నేతగా ఎలా ఉన్నారో.. అధికారపక్ష అధినేతగా.. ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా తనలో ఇసుమంత మార్పు కూడా లేదన్న విషయాన్ని రేవంత్ తన రెండు గంటలకు పైగా సాగిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారని చెప్పాలి.

Tags:    

Similar News