రేవంత్ ను అమిత్ షా భయపెడుతున్నాడా ?

"అమిత్ భాయ్ నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమం అఫైర్స్ ను ఉపయోగించుకుంటున్నాడు

Update: 2024-05-09 08:50 GMT

"అమిత్ భాయ్ నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమం అఫైర్స్ ను ఉపయోగించుకుంటున్నాడు. ఒక రాజకీయ పార్టీ వ్యతిరేకంగా మార్ఫింగ్ వీడియో తయారు చేస్తే , ఒక రాజకీయ పార్టీ లేదా నాయకుడు, లేదా సంబంధిత రాజకీయ పార్టీ ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. కానీ ఈడీ మరియు సీబీఐని ఉపయోగించినట్లుగా వారు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కోర్టుకు నా ట్విట్టర్ అకౌంట్ల వివరాలు ఇచ్చాను. సోషల్ మీడియా యుగంలో ఇష్టారాజ్యంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు..అందుకు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసి నోటీసులు పంపుతున్నారు. ఇది సరైనది కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు.

రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన మార్ఫింగ్ వీడియోకు సంబంధించి రేవంత్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ తనను కేంద్ర హోంమంత్రి భయపెట్టాలని చెప్పడం సంచలనం రేపుతున్నది.

అదే సమయంలో రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి కూడా రేవంత్ స్పందించాడు. ‘పీఎం పదవిలో ఉండి నరేంద్రమోడీ అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. రాహుల్‌గాంధీ ఎలాంటి వాడో ప్రపంచానికి తెలుసు. అతను నిజాయితీపరుడు. వారి ఇంట్లో ముగ్గురు ప్రధానులు ఉన్నారు. అయినా ఆయనకు సొంత ఇల్లు లేదు. మోడీ ప్రధానమంత్రి పదవిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే అది అతనికి సరిపోదు’ అని వ్యాఖ్యానించడం విశేషం.

Tags:    

Similar News