బాబు రేవంత్ భేటీకి ముహూర్తం ఫిక్స్

రెండు రాష్ట్రాల మధ్య చర్చలు అర్ధవంతంగా సాగితే దాని ఫలితాలు కొడా బాగా వస్తాయని అన్నారు. ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య చర్చల ద్వారా మంచి జరుగుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లుగా బాబు చెప్పారు.

Update: 2024-07-01 17:32 GMT

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 6వ తేదీన భేటీ అవుదామని ఏపీ సీఎం బాబు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పదేళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల మీద పూర్తి స్థాయిలో చర్చించడానికి ఈ నెల సాయంత్రం భేటీ అవుదామని రేవంత్ రెడ్డి కి చంద్రబాబు కోరుతూ లేఖ రాశారు. ఈ మేరకు ఏపీకి ఆహ్వానించారు కూడా.

ఎంతో జటిలమైన సమస్యలు కష్టతరమైనవి కూడా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని చంద్రబాబు రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే విధంగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

పదేళ్ల సుదీర్ఘ కాలంలో కొన్ని సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని బాబు గుర్తు చేశారు. వాటి మీద పూర్తి స్థాయిలో చర్చించాల్సి ఉందని కూడా రేవంత్ రెడ్డి కి బాబు గుర్తు చేశారు. ముఖా ముఖీ చర్చల ద్వారానే సమస్యల పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుందని ఆయన ఆకాంక్షించారు.

తెలంగాణా అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని కూడా బాబు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆయనకు హృదయ పూర్వకమైన అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని బాబు ఆనందం వ్యక్తం చేశారు.

Read more!

ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణ సన్నిహిత సంబంధాలు ఉంటే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని బాబు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు అర్ధవంతంగా సాగితే దాని ఫలితాలు కొడా బాగా వస్తాయని అన్నారు. ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య చర్చల ద్వారా మంచి జరుగుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లుగా బాబు చెప్పారు.

ఇదిలా ఉండగా చంద్రబాబు సీఎం అయిన తరువాత తొలిసారి రేవంత్ రెడ్డిని చర్చలకు పిలిచారు ఇది మంచి పరిణామంగా అంతా భావిస్తున్నారు. ఏపీ తెలంగాణాల మధ్య ఉన్న సమస్యలు అనేక విభజన అంశాలు కనుక చర్చకు నోచుకుని మంచి పరిష్కారాలు లభిస్తే ఏపీకి అది అన్ని విధాలుగా మేలు చేస్తుందని అంటున్నారు. ఈ విషయంలో తెలంగాణా సీఎం ని బాబు ఆహ్వానించడం ఆయన రాజకీయ పరిణతిని సూచిస్తోందని అంటున్నారు. ఈ లేఖ పట్ల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించే అవకాశలు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఈ నెల 6న ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి ముహూర్తం కుదిరింది అని అంటున్నారు.

Tags:    

Similar News