అసెంబ్లీలో కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు.. ఏమన్నారంటే?

అసలు తెలంగాణ ఇచ్చిందే తమ పార్టీతో అంటూ కాంగ్రెస్ తిప్పికొట్టింది. అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు (డిసెంబర్ 16)న జరిగిన చర్చ అర్థవంతంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-12-16 15:51 GMT

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేసిన ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ తీరు ఇలా ఉందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తే.. అసలు తెలంగాణ ఇచ్చిందే తమ పార్టీతో అంటూ కాంగ్రెస్ తిప్పికొట్టింది. అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు (డిసెంబర్ 16)న జరిగిన చర్చ అర్థవంతంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. అసెంబ్లీ చర్చలు తొమ్మిదేళ్లుగా వార్ వన్ సైడ్ గా కొనసాగాయి. అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉండడంతో బీఆర్ఎస్ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. సభలో జవాబుదారీ తనం లేదని కాంగ్రెస్, బీజేపీ పక్షలు గగ్గోలు పెట్టాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అలా లేదు. బొటా బొటిన మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువగా దక్కించుకున్న కాంగ్రెస్ కు సభలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలిచింది. దీంతో రెండు పార్టీలు సభలో ఢీ అంటే ఢీ అంటూ అస్త్ర శస్త్రాలు నూరుతున్నాయి.

ఈ రోజు జరిగిన చర్చలో సీఎం రేవంత్, సోనియా గాంధీపై బీఆర్ఎస్ శిభిరంలో ప్రధాన నేతలైన హరీశ్ రావు, కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు టీఆర్ఎస్ తోనే కాంగ్రెస్ గెలిచిందని హరీశ్ రావు.. అనగా రాష్ట్రం ఇచ్చిందే తమ పార్టీ అని రేవంత్ సమాధానం చెప్పారు. తనను ఎన్ఆర్ఐ మినిస్టర్ అన్న రేవంత్ రెడ్డి అదే ఎన్ఆర్ఐని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని చేయలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. ఆయన ఏమన్నారంటే 'వరి వేస్తే ఉరే అని గతంలో చెప్పిన కేసీఆర్.. తన ఫామ్ హౌజ్ లో 150 ఎకరాల్లో వరి వేసి ప్రైవేట్ కంపెనీల మెడపై కత్తిపెట్టి క్వింటాల్ ను రూ. 4250కు అమ్ముకున్నాడు' అంటూ రేవంత్ ఆరోపణలు చేశారు. దీంతో ఎవరికి అమ్ముకున్నాడని బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ప్రశ్నించారు. 'మీరు సిద్ధంగా ఉంటే ఈ రోజు నేను విచారణకు ఆదేశిస్తా' అంటూ జవాబు ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు సైలెంట్ గా ఉన్నారు.

Tags:    

Similar News