రేవంత్ రెడ్డి ట్యాగ్ ఉంటే చాలు ట్రెండింగ్...!

అంతేనా ఆ ఒక్క పేరు చాలునా అంటే అంతే అంటోంది సోషల్ మీడియా. రేవంత్ అన్న మూడు అక్షరాలు ఇపుడు టాప్ లెవెల్ లో ట్రెండ్ అవుతున్నాయి

Update: 2023-12-25 04:06 GMT

అంతేనా ఆ ఒక్క పేరు చాలునా అంటే అంతే అంటోంది సోషల్ మీడియా. రేవంత్ అన్న మూడు అక్షరాలు ఇపుడు టాప్ లెవెల్ లో ట్రెండ్ అవుతున్నాయి. రేవంత్ ఒక సంచలనంగా మారిపోయారు. ఒక వైరల్ గా మారిపోయారు. ఆయన గెలుపు ఒక అద్భుతం, ఆయన ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం ఒక కీలకమైనది. ఆయన ప్రతీ అడుగు, నడక అన్నీ కూడా సూపర్ ట్రెండింగ్.

అది వార్త అయినా వూసు అయినా లేక ఏ చిన్న మేసేజ్ అయినా రేవంత్ అన్న ట్యాగ్ ఉంటే చాలు వైరల్ గా బాప్ అవుతోంది. ట్రేండింగ్ లో మాస్టర్ డిగ్రీ తీసుకుంటోంది. ఆయన గురించిన కంటెంట్ తో ఏది వచ్చినా అది డిజిటల్ ఫ్లాట్ ఫారం మీద టాప్ లెవెల్ లో ఫోకస్ అవుతోంది. అలాగే ఆయన సోషల్ మీడియా అయితే షేక్ అవుతోంది.

చెప్పాలంటే కొన్ని సార్లు కొందరి వ్యక్తులకు అలాగే జరుగుతుంది. అవధులు దాటిన ప్రేమాభిమానాలు హద్దులు మీరిన ప్రజాదరణ. వారి మీద పెట్టుకున్న ఆశలు అన్నీ కలసి వారిని సూపర్ మ్యాన్ గా చేసేస్తాయి. తెలంగాణా కొత్త సీఎం రేవంత్ రెడ్డి తన లోని సత్తాను చాటుకున్నారు. ఒక సామాన్యుడి నుంచి అసమాన్యుడు అయ్యారు.

తెలంగాణా సీఎం కావడం తన కల అని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పుకున్నారు. అది అందుకున్నారు. ఆ విషయంలోనూ ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంతటి స్థాయికి రావడం అంటే రేవంత్ ఆ విధంగా ఎందరికో రోల్ మోడల్ గా నిలిచారు అని చెప్పారు.

అందుకే ఆయన్ని కేవలం పొలిటికల్ పీపుల్ మాత్రమే వాచ్ చేయడం లేదు. అనేక రంగాల వారు కూడా ఆయన్ని గమనిస్తున్నారు. ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్ గా యూత్ తీసుకుంటున్నారు. రేవంత్ పట్టుదల ఉంటే తాము ఎంచుకున్న రంగాలలో రాణించవచ్చు అన్నది చాలా మంది యూత్ భావనగా ఉంది. అంతే కాదు రాజకీయాల్లో నాయకులుగా ఎదిగే వారికి ఆయన రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.

ఇక రేవంత్ కనీసం మంత్రిగా కూడా పనిచేయలేదు. ఆయన డైరెక్ట్ గా సీఎం అయిపోయారు. ఎలా పాలిస్తారు అన్న ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఆయన సీఎం అయ్యాక వేసిన ప్రతీ అడుగు కూడా కచ్చితంగా క్రమబద్ధంగా ఉంటోంది. అందరి మెప్పునూ అందుకుంటోంది. ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్నది కూడా కొత్త సీఎం గా రేవంత్ రెడ్డి పనితీరులో కనిపిస్తోంది.

కాంగ్రెస్ లాంటి ఓల్డ్ పార్టీ ఒక ట్రెడిషనల్ పార్టీకి సీఎం గా ఉంటూ ఎంతో మంది సీనియర్ల మధ్యన నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి పాలన మీద అందరి కళ్లూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన్ని కోటి కళ్ళు వీక్షిస్తున్నాయి. అందుకే ఆయన సోషల్ మీడియా హీరో అయిపోయారు. ఆయన గురించి ఏ చిన్న విషయం అయినా ప్రతీ కళ్ళూ వెతుకుతున్నాయి.

అలా పాపులర్ అయిపోయిన రేవంత్ రెడ్డి ట్రెండింగ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కొత్త ఏడాదిలో జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కనుక రేవంత్ రెడ్డి తెలంగాణా రాజకీయ బాహుబలి అయిపోతారు. ఇక ఆయన దూకుడు వేరే రేంజిలో ఉంటుంది. అపుడు ట్రెండింగ్ మరో స్థాయిలో ఉంటుంది. సో రేవంత్ రెడ్డి అన్న మూడు అక్షరాలు మాత్రం సామాజిక మాధ్యమాలను కొన్నాళ్ళ పాటు అలా షేక్ చేస్తూనే ఉంటాయని చెప్పక తప్పదు, ప్రత్యర్ధులు సైతం ఒప్పుకోక తప్పదు.

Tags:    

Similar News