చిన్నతనంలో జాతివివక్ష ఎదుర్కొన్నా.. రిషి సునాక్ సంచలనం

చిన్నప్పుడు తాను జాతి వివక్షకు గురైనట్లు చెప్పిన ఆయన.. జాతివివక్ష ఏ రూపంలో అంగీకరించలేమని స్పష్టం చేశారు.

Update: 2024-02-05 04:46 GMT

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ ఓపెన్ అయ్యారు. ఉన్నది ఉన్నట్లుగా.. గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఆయన చెప్పేశారు. తాను చిన్నతనంలో జాతివిక్షకు గురైనట్లుగా చెప్పారు. ఇంగ్లిష్ ఉచ్చారణలో యాస లేకుండా తన తల్లిదండ్రులు ఎన్నోజాగ్రత్తలు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన బోలెడన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. సాధారణంగా అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు గతంలో తమకు ఎదురైన నెగిటివ్ అంశాల్ని ప్రస్తావించకుండా ఉండిపోతారు.

అందుకు భిన్నంగా రిషి సునాక్ మాత్రం.. తాను ఎదుర్కొన్న విషయాల్ని ఓపెన్ గా చెప్పేశారు. చిన్నప్పుడు తాను జాతి వివక్షకు గురైనట్లు చెప్పిన ఆయన.. జాతివివక్ష ఏ రూపంలో అంగీకరించలేమని స్పష్టం చేశారు.

తన తోబుట్టువులు తనను ఎటకారం చేయటం.. వెక్కిరింతల్ని తాను అనుభవించినట్లుగా పేర్కొన్నారు. అప్పట్లో తానెంతో బాధ పడినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్నారు.

తాను తన చిన్నప్పుడు ఎదుర్కొన్న జాతివివక్షను ఇప్పుడు తన పిల్లలు ఎదుర్కోవటం లేదన్నారు. తన భారతీయ వారసత్వం గురించి వెల్లడించిన సునాక్.. ఆకారం.. రూపం ఒక అవరోధంగా మారకూడదని చెప్పేవారని.. భారతీయ తరహా యాస బయటపడకుండా మాట్లాడాలని పదే పదే చెప్పేవారన్నారు.

తాము సరిగా మాట్లాడకపోతే దానిపై ఫోకస్ చేసే వారన్నారు. సరైన అభ్యాసంతోనే తాను బ్రిటిష్ యాసనను సరిగ్గా అనుకరించగలిగినట్లుగా పేర్కొన్న రిషి సునాక్.. తన మారిన యాసను చూసి తన తల్లి చాలా ఆనందానికి గురయ్యేదన్నారు. జాత్యాహంకార ధోరణి ఏ రూపంలో ఉన్న ఒప్పుకునేది లేదన్న రిషి సునాక్ మాటలు ఆసక్తికరంగా మారాయి.

 

Tags:    

Similar News