ఇండియా కూటమిలో రాబర్ట్ వాద్రా రచ్చ లేపాడా ?!

కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ భర్తగా రాబర్ట్ వాద్రా ప్రపంచానికి పరిచయం. గతంలో ఎన్నడూ ఆయన రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి చూపింది లేదు.

Update: 2024-05-27 05:30 GMT

కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ భర్తగా రాబర్ట్ వాద్రా ప్రపంచానికి పరిచయం. గతంలో ఎన్నడూ ఆయన రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి చూపింది లేదు. అయితే ఈ సారి అనూహ్యంగా రాయ్ బరేలీ లేదా అమేథీల నుండి పోటీ చేయాలని భావించాడు. ఆయన పోటీ చేయాలని పోస్టర్లు కూడా వెలిశాయి. చివరి నిమిషం వరకు ఆయన పేరు వినిపించినా పోటీలో లేకుండా పోయాడు.

అయితే తాజాగా రాబర్ట్ వాద్రా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తో పాటు సొంత పార్టీ కాంగ్రెస్ నేతల మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అరవింద్ కేజ్రివాల్ ను రాబర్ట్ ‘అవకాశవాది’ అని పేర్కొన్నాడు. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి కదా అని ప్రశ్నిస్తే ఇది తన సొంత అభిప్రాయం అని వెల్లడించాడు.

కేజ్రీవాల్‌ మీదనే కాకుండా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్‌ ‘‘లౌడ్ మౌత్’’ అని, సుధీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ని ‘‘అనుభవం లేనివాడు’’ అని, ఇటీవల భారతీయులను ఉద్దేశించి మాజీ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ‘‘రిటైర్డ్ వ్యక్తి పదవీ విరమణ చేయాలి’’ అని చెప్పడం కలకలం రేపుతున్నది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న క్రమంలో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో వేచిచూడాలి.

Tags:    

Similar News