‘అలాంటి’ వీడియోస్ నారా లోకేష్ చూస్తాడేమో!

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది ట్యాబ్‌ లు పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల వైఎస్ జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Update: 2023-12-23 08:38 GMT

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది ట్యాబ్‌ లు పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల వైఎస్ జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన జగన్... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ప్రభుత్వం ట్యాబ్ లు ఇవ్వడంపై విపక్షాలు, వారి అనుకూల మీడియా అవాకులూ చెవాకులూ పేలుతుందని ఫైరయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాలపై రోజా తనదైన శైలిలో స్పందించారు.

అవును... ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీషు మీడియం, ఇంగ్లీషు ల్యాబ్‌ లు, డిజిటల్‌ బోధనతో తీర్చిదిద్ది బైజూస్‌ కంటెంట్‌ తో ఖరీదైన ట్యాబ్‌ లను పిల్లలకు ఉచితంగా అందిస్తున్నామని.. ఫలితంగా... ప్రాథమిక స్థాయి నుంచి టోఫెల్‌ శిక్షణతోపాటు సీ.బీ.ఎస్‌.ఈ నుంచి ఐబీ దాకా అడుగులు వేయడంతో ఇప్పుడు ప్రైవేట్‌ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడాల్సిన పరిస్థితి కల్పించామని వైఎస్ జగన్ చెబుతున్నారు. ఈ సమయంలో లోకేష్ పై ఫైరయ్యారు రోజా.

ఇందులో భాగంగా... పిల్లలంతా కూడా పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునే విధంగా బైజూస్ కంటెంట్ తో 8వ తరగతి నుంచి ట్యాబ్ లు ఇస్తుంటే.. ఆ ట్యాబ్ లలో పిల్లలు అశ్లీలమైనవి చూసి చెడిపోతున్నారంటూ... నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రోజా ఫైరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు అంతా చక్కగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ బైజూస్ కంటెంట్ తో ఉన్న ట్యాబ్ లను అందిస్తున్నారని అన్నారు.

ఒక్కో విద్యార్థికీ సుమారు 33,000 రూపాయల ఖర్చు అవుతున్నా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఈ ట్యాబ్ లు ఫుల్ రిస్ట్రిక్టెడ్ గా ఉంటాయని.. వీటిలో సబ్జెక్ట్ తప్ప మరేదీ ఉండదని.. యూట్యూ, ఇంటర్ నెట్ బ్రౌజింగ్ కంటెంట్ చూడటానికి ఇందులో అవకాశం లేదని అన్నారు. అయితే... "అలాంటివి" లోకేష్ బాగా చూస్తాడేమో.. అందుకే అతనికి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని రోజా ఫైరయ్యారు. దీంతో ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

కాగా... ఇదే విషయాలపై ఇటీవల ఫైర్ అయిన జగన్... తప్పుడు రాతలతో పేద విద్యార్థులపై విషం కక్కొద్దని మీడియాకు సూచించిన సంగతి తెలిసిందే. పిల్లలు మరింత మెరుగ్గా పాఠ్యాంశాలను అవగాహన చేసుకునేలా ట్యాబ్‌ లు అందిస్తుంటే... వారిని చెడగొడుతున్నారంటూ దుర్మార్గమైన కథనాలు ప్రచురిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా... మీ పిల్లలు, మనవళ్ల చేతిలో ట్యాబ్‌ లు, ల్యాప్‌ టాప్‌ లు ఉండవచ్చా? అని జగన్ నిలదీశారు!

Tags:    

Similar News