రోజా ప్లేస్ లో నగరి లో కొత్త నేత ?

ఆమె మకాం చెన్నైకి మార్చేశారు అని అంటున్నారు. ఆమె ఓటమి తరువాత నగరి రావడం మానుకున్నారు అని అంటున్నారు

Update: 2024-08-13 16:30 GMT

వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఏమైపోయారు అన్న చర్చ వైసీపీలో సాగుతోంది. ఆమె వైసీపీ ఓటమి తరువాత మీడియా ముందుకు రావడం లేదు. ఇటీవల ఆమె తన కుటుంబంతో విదేశాలలో టూర్ చేస్తున్నట్లుగా ఫోటోలు అయితే వచ్చాయి. ఇక రోజా ఎక్కడ ఉన్నారు అంటే అయితే విదేశాలలో లేకపోతే చెన్నైలో అని ప్రచారం సాగుతోంది.

ఆమె మకాం చెన్నైకి మార్చేశారు అని అంటున్నారు. ఆమె ఓటమి తరువాత నగరి రావడం మానుకున్నారు అని అంటున్నారు. నిజానికి రోజా ఎమ్మెల్యేగా ఉన్నపుడు నగరికి నెలలో ఒకసారి అయినా వచ్చేవారు. ఆమె నగరిలో అద్భుతమైన ఇల్లు నిర్మించుకున్నారు. తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అని కూడా చెప్పారు.

అయితే వైసీపీ ఓటమి తరువాత మాత్రం రోజా నగరికి దూరం అయ్యారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆమె ఒక విధంగా వైరాగ్యంలో ఉన్నారని అంటున్నారు. ఆమె ఓటమి వెనక సొంత పార్టీ వారు కూడా ఉండడమే ఆమెను కలచివేసింది అని అంటున్నారు.

నగరిలో వర్గ పోరుని మంత్రిగా ఉన్నపుడు అయినా ఆమె సెట్ చేసుకోలేకపోయారు అని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా ఈ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో ఆమెకు భారీ నష్టం వాటిల్లింది. మరో వైపు రోజా నగరిలో తనకు ఎదురులేదని కూడా భావించారు అని అంటున్నారు. నగరిలో సీనియర్ టీడీపీ నేత ముద్దు కృష్ణమనాయుడు మరణం తరువాత వారసత్వం కోసం ఆ కుటుంబంలో సాగిన పోరుతో టీడీపీ ఇబ్బంది పడింది. దాంతో 2014, 2019లలో రోజా విజయం సాధించారు. ఇక అలాగే ఎప్పటికీ పరిస్థితి ఉంటుందని ఊహించారు అని అంటున్నారు.

అదే ఆమె చేసిన పొరపాటు అని కూడా అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం వద్ద ఉన్న సాన్నిహిత్యంతో ఆమె టికెట్ అయితే తెచ్చుకోగలిగారు కానీ ఆమె నగరి ప్రజల మనసును గెలుచుకోలేకపోయారు. నిజానికి నగరి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ ఆర్కే రోజాకు అది కలిసి వచ్చింది.

అక్కడ తమిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆమె భర్త సెల్వమణి తమిళుదు కావడం వల్ల ఆయన కులస్తులు అంతా ఎక్కువగా ఉండడం ఆమెకు ప్లస్ అయింది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం అది రివర్స్ అయింది. తాను తప్ప ఎవరు గెలుస్తారు అని దూకుడుగా వెళ్ళిన రోజాకు చేదు ఫలితం ఎదురైంది. సొంత పార్టీలో వారిని కలుపుకోవడంలో విఫలం కావడమే ఎక్కువ డ్యామేజ్ చేసింది అని అంటున్నారు.

మరో వైపు జగన్ అయితే రోజాకు ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు చిత్తూరు జిల్లాలో ఉన్నా కూడా రోజాకు మంత్రి పదవి కట్టబెట్టారు. వైఎస్ జగన్ వెంట నడిచి వైఎస్సార్ కుటుంబానికి అత్యంత విధేయుడుగా ఉన్న భూమన కరుణాకరరెడ్డిని సైతం పక్కన పెట్టేశారు జగన్. అలా అధినాయకత్వం ఎంతగానో ప్రోత్సహించినా రోజా మాత్రం తన రాజకీయ భవిష్యత్తుకు పటిష్టమైన బాటలు వేసుకోలేకపోయారు అని అంటున్నారు.

ఆమె మంత్రిగా కూడా తన కత్తికి ఎదురులేకుండా ఉండాలని తపన పడేవారు అంటారు. ఇక నగరి లో ఆమె సోదరుడి ఆధిపత్యం కూడా ఆమెకి పార్టీకి మధ్య గ్యాప్ పెంచిందని అంటారు. ఏది ఏమైనా ఓటమి ఘోరమైనది దానిని తట్టుకుని తగిన పాఠాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి.

కానీ రోజా మాత్రం నగరి వైపు చూడటం లేదు అని అంటున్నారు. నగరిలోని ఆమె ఇంటికి వెళ్తున్న వైసీపీ క్యేడర్ అక్కడ తాళం వేసి ఉండడాన్ని గమనిస్తున్నారు అని అంటున్నారు. దాంతో నగరికి కొత్త నాయకుడు కావాలని వైసీపీలో అయితే డిమాండ్ పెరుగుతోంది. రోజా మళ్ళీ తన సొంత నియోజకవర్గం నుంచి రాజకీయం చేస్తారా లేక నగరికి గుడ్ బై చెబుతారా అన్నది కూడా చర్చగా ఉంది. వైసీపీ అధినాయకత్వం అయితే ఈ విషయంలో సీరియస్ గానే నిర్ణయం తీసుకోవాలని క్యాడర్ కోరుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News