బ్రిటన్ ప్రధాని అమెరికా వెళ్లిపోతున్నారా?... సమాధానం ఇదే!

కాగా... జులై 4న బ్రిటన్‌ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు రిషి సునాక్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-29 04:49 GMT

ఇటీవల ఒక ఊహించని ఊహాగాణం ఒకటి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం బ్రిటన్, అమెరికాలతో పాటు భారత్ లోనూ చర్చనీయాంశం అయ్యింది. అదేమిటంటే... బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రధాని రిషి సునాక్.. ఆ దేశం విడిచి వెళ్లిపోయే ప్రణాళికల్లో ఉన్నారంట. ప్రస్తుతం ఈ తరహా ఆరోపణలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు.

అవును... సార్వత్రిక ఎన్నికల అనంతరం బ్రిటన్‌ దేశం విడిచి వెళ్లిపోయే ప్రణాళికల్లో ఉన్నారంటూ ప్రధాని రిషి సునాక్‌ పై ఆరోపణలు వెళ్లువెత్తాయి! ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన ఈ ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా... బ్రిటనే తన ఇల్లు అని, ఎన్నికల తర్వాత తన కుటుంబాన్ని అమెరికాకు తరలించే ఆలోచనేదీ తనకు లేదని స్పష్టం చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... అధికార కన్జర్వేటివ్‌ పార్టీని బాగుచేయలేనంత స్థాయిలో ప్రధాని రిషి సునాక్‌ దెబ్బతీశారని.. ఫలితంగా ఎన్నికల అనంతరం కొన్ని వారాల్లో ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లిపోవాలని ప్రణాళికలు రచిస్తున్నారని అదే పార్టీకి చెందిన నేత జాక్‌ గోల్డ్‌ స్మిత్‌ ఇటీవల ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ఇవి తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

దీంతో తనపై వస్తోన్న ఆరోపణలపై తాజాగా సునాక్ స్పందించారు. అమెర్‌ శామ్‌ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన ఆయన ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే... గోల్డ్‌ స్మిత్‌ తమ కుటుంబ విషయాల గురించి అవగాహన ఉన్నట్లు చెప్పడం ఆశ్చర్యమేసిందని.. తాను నేను ఎక్కడికీ వెళ్లడం లేదని సునాక్ స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో.. బ్రిటన్ దేశమే తన ఇల్లు అని, సౌతాంప్టన్‌ లో తాను పుట్టి పెరిగానని.. స్థానిక సమాజానికి సేవ చేయాలనే లువలకు కట్టుబడి ఉన్నానని.. అదే చేస్తూ వచ్చానని.. తన ఇద్దరు కుమార్తెలు ఇక్కడే చదువుకుంటున్నారని.. కుటుంబాన్ని ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించే ఉద్దేశం తనకు లేదని.. స్పష్టం చేశారు.

కాగా... జులై 4న బ్రిటన్‌ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు రిషి సునాక్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... బ్రిటన్‌ ప్రజలకు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో... ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా తన హయాంలో సాధించిన విజయాలను గుర్తుచేశారు.

Tags:    

Similar News