సబర్మతి ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం... అసలేం జరిగింది?

ఇటీవల కాలంలో జరుగుతున్న రైలు ప్రమాధాల ఘటనలు వినగానే టెన్షన్ ప్రారంభమైపోతున్న పరిస్థితి.

Update: 2024-08-17 04:57 GMT

ఇటీవల కాలంలో జరుగుతున్న రైలు ప్రమాధాల ఘటనలు వినగానే టెన్షన్ ప్రారంభమైపోతున్న పరిస్థితి. ఇప్పటికే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురవ్వడం, అవి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మరిచిపోకముందే... తాజాగా మరో రైలు ప్రమాదం సంభవించింది. దీంతో... ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదాల్లో ఇది మూడోది అయ్యింది.

అవును... తాజాగా మరో ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఇందులో భాగంగా వారణాసి జంక్షన్ – అహ్మదాబాద్ మధ్య రాకపోకలు సాగించే సబర్మతి రైలు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏకంగా 22 బోగీలు చెల్లాచెదురయ్యాయి.

శుక్రవారం రాత్రి వారణాసి జంక్షన్ నుంచి అహ్మదాబాద్ కు బయలుదేరిన సబర్మతి ఎక్స్ ప్రెస్ యూపీలో ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో కాన్పూర్ - భీంసేన్ పరిధిలోని గోవింద్ పురి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. దీజంతో విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.

మరోపక్క రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అయితే... ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహానీ జరగలేదని అధికారులు చెబుతున్నారు. కాకపొతే కొంతమంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలు కాగా.. వారికి ప్రాథమిక చికిత్స అందజేశారు.

ఈ ఘటన తెరపైకి రాగానే... ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం ప్రయాగ్ రాజ్, మీర్జాపూర్, ఫతేపూర్, కాన్పూర్ సెంట్రల్, ఇటావా, చునార్, ఫఫుండ్ రైల్వే సేష్టనలలో ప్రత్యేకంగా ఏర్పాటు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణకు అధికారుల్లు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన కాన్పూర్ డివిజినల్ రైల్వే మేనేజర్ రాకేష్ కుమార్ సింగ్... కొంతమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా.. వారికి అక్కడే చికిత్స అందించినట్లు తెలిపారు. కాస్త తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులు ఎవరూ లేరని అన్నారు. అయితే... పట్టాలపై ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులు, రాళ్లు ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.

దీంతో... పోలీసులు, ఐబీ సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాయని అంటున్నారు. ఇదే సమయంలో... ఇంజిన్ ఢీకొన్ని వస్తువు ఆనవాళ్లను అధికారులు భద్రపరిచారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రయాణికులందరినీ ప్రత్యామ్నాయ పద్దతుల్లో గమ్యస్థానాలకు చేర్చిందని తెలుస్తోంది.

Tags:    

Similar News