ముంబై నటి వేధింపుల కేసు... సజ్జల సంచలన నిర్ణయం!

ఈ నేపథ్యంలో... గత రెండు మూడు రోజులుగా మీడియాలో హల్ చల్ చేసిన ఈ విషయం.. ఇప్పుడు విజయవాడ పోలీసుల వద్దకు చేరింది.

Update: 2024-08-31 07:40 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముంబై నటి కాదంబరీ జెత్వానీ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనను వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపిస్తూ.. గత ప్రభుత్వంలోని పెద్దలు, పోలీస్ అధికారుల పాత్రనూ ప్రత్యేకంగా ప్రస్థావించింది. దీంతో... ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో... గత రెండు మూడు రోజులుగా మీడియాలో హల్ చల్ చేసిన ఈ విషయం.. ఇప్పుడు విజయవాడ పోలీసుల వద్దకు చేరింది. ఇందులో భాగంగా... విజయవాడ సీపీని కలిసి జెత్వానీ... తనపై వేధింపులు జరిగాయంటూ పలు ఆధారాలను అందజేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో... సజ్జల రామకృష్ణారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... గత ప్రభుత్వంలోని పెద్దలు, పోలీసు అధికారులపై ముంబై నటి కాదంబరీ జెత్వానీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆమె చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైరవుతూ వారిపై చర్యలకు ఉపక్రమించారు.

ఇందులో భాగంగా... "ముంబై నటికి వేధింపులు.. సజ్జల సహాయం" పేరుతో కథనం ప్రచురించి, తనపై దుష్ప్రచారం చేశారంటూ ఓ ప్రధాన దినపత్రికతో పాటు.. ఆ కథనం ఆధారంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యపైనా పరువు నష్టం దావా వేశారు.

ఈ సందర్భంగా అటు దినపత్రికకు, ఇటు వర్ల రామయ్యకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల లీగల్ నోటీసులు పంపించారు. ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారానికి దిగుతోందని ఆయన ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వారికి లీగల్ నోటీసులు పంపించారు.

ఈ సందర్భంగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. తనను అప్రదిష్టపాలు చేయడంలో భాగంగానే ఈ నటిని తెలుగుదేశంపార్టీ రంగంలోకి దింపిందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచెయలేక, ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యక్తిత్వ హనానానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News