కిషన్‌రెడ్డికి బండి సంజయ్ స్వీట్ టార్గెట్!
ఈ స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న సికింద్రబాద్ ఎంపీ కిషన్‌రెడ్డిని నియమించారు. ఇప్పుడు ఈయన హయాంలోనే పార్టీ కీలక ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలాంటి టర్న్‌లు తీసుకుంటారో చెప్పలేం. అసంతృప్తులు ఎప్పుడు ఏ రూ పంలో పెల్లుబుకుతాయో కూడా.. ఊహించలేం. ఇప్పుడు కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమ యంలో అధికారంలోకి వచ్చేయాలని భావించి.. ఇప్పుడు కనీసం గౌరవప్రదమైన స్థానాలైనా దక్కించుకు ని పరువు కోసం పాకులాడుతున్న బీజేపీలో చిచ్చు రేగింది. ఎన్నికలకుముందు.. ఏం జరిగిందో .. ఏమో.. కానీ, తెలంగాణ చీఫ్‌గా ఉన్న బండి సంజయ్‌ను పక్కన పెట్టారు.
ఈ స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న సికింద్రబాద్ ఎంపీ కిషన్‌రెడ్డిని నియమించారు. ఇప్పుడు ఈయన హయాంలోనే పార్టీ కీలక ఎన్నికల్లో పోటీ చేస్తోంది.ఇక, సంజయ్‌కు ఈ ఎన్నికలకు సంబంధమే లేదన్న ట్టుగా.. కేంద్రంలోని కమల నాథులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయన కూడా అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. అయితే.. తాజాగా కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన టికెట్ సాధించారు. దీనికి సంబందించి నామినేషన్ కూడా వేశారు.
అయితే, ఈ సందర్భంగా బండి చేసిన వ్యాఖ్యలు.. సంచలనంగా మారాయి. ప్రస్తుత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి బండి సంజయ్.. స్వీట్ టార్గెట్ పెట్టేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎలా అంటే.. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పార్టీని పరుగులు పెట్టించానని బండి చెప్పారు. అంతేకాదు.. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. 150 రోజుల పాటు ప్రజాసంగ్రామ పాదయాత్ర కూడా చేశానని.. కేసులు కూడా పెట్టించుకున్నానన్నారు.
ఇక, హుజూరాబాద్, దుబ్బాక బైపోల్స్‌లో బీజేపీకి ఘన విజయం తీసుకువచ్చానన్నారు. అదేసమయంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చేలా చక్రం తిప్పానని ఏకరువు పెట్టారు. కట్ చేస్తే.. ఇవన్నీ కూడా.. కిషన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకునే బండి వ్యాఖ్యానించారనే వాదన వినిపిస్తోంది. కిషన్ రెడ్డి సత్తా ఏంటో ఈ ఎన్నికల్లో తేలిపోతుందనే విధంగా బండి వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. తాను ఎంతో చేశానని.. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆ మాత్రం చేయగలరా? అనే మాట విరుపులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరి ఇది ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.