షర్మిల కన్ఫర్మ్.. నామినేషన్ అక్కడేనట...?
వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే వరకు చేరిన దివంగత సీఎం వైఎస్ తనయ వైఎస్ షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మొత్తానికి పోటీకి రెడీ అవుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక అన్ని చోట్లా పోటీ అంటూ వైఎస్సార్టీపీ ప్రకటించింది కానీ ఇప్పటిదాకా అభ్యర్ధుల జాబితా అయితే రిలీజ్ చేయలేదు.
అదే టైం లో తాము పోటీలో ఉంటున్నామని చెప్పినా ఆ పార్టీ నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్ధులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్లుగా కనిపించడంలేదు. అయితే తాను తెలంగాణ వ్యాప్తంగా యాభై సభలలో ప్రసంగిస్తాను అని షర్మిల ప్రకటించారు.
దాంతో యాభై సీట్లకు అయినా వైఎసార్టీపీ పోటీ చేస్తుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. షర్మిల పార్టీ కొద్ది నెలల క్రితం చేసిన హడావుడి అయితే తరువాత కాంగ్రెస్ తో పొత్తులు విలీనం అనన్ దాంతో బాగా తగ్గిపోయింది. ఇపుడు చూస్తే కొంత స్తబ్దత నెలకొని ఉంది.
ఇపుడు షర్మిల పాలేరు నుంచి పోటీ అని కన్ఫర్మ్ చేశారు. ఇక సుడిగాలి పర్యటనే అని ఆమె అంటున్నారు. నెల రోజులు కూడా గట్టిగా లేని చోట ఆమె సభలు నిర్వహించడం ఒక సవాల్ గా ఉంటే అదే టైం లో అభ్యర్ధుల లిస్ట్ ఎపుడు వస్తుంది, ఎంతమంది ఎన్ని చోట్ల పోటీకి దిగుతారు అన్నది మాత్రం చర్చనీయాంశంగా ఉంది.
మరో వైపు చూస్తే ప్రధాన పార్టీలు అన్నీ రంగంలోకి ఎపుడో దిగిపోయాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ బీయారెస్ ల మధ్యనే ముఖా ముఖీ పోరు నెలకొని ఉంది అని అంటున్నారు. బీజేపీని కూడా తగ్గించేందుకు ఆ పార్టీ నుంచి ఫిరాయింపులను ఒక లెవెల్ లో ప్రోత్సహిస్తున్నారు. దాత్నో కమలం పార్టీ కకావికలు అవుతోంది.
అదే విధంగా బహుముఖ పోటీలు ఉంటాయని అనుకుంటే మజ్లీస్ తో అధికార బీయారెస్ కి అవగాహన ఉంది. కాంగ్రెస్ టీజేఎస్ లాంటి పార్టీలతో అవగాహనకు వచ్చింది. అలాగే కమ్యూనిస్టులతో పొత్తు కుదుర్చుకుంటోంది. బీజేపీని టార్గెట్ చేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది.
ఇక షర్మిల పార్టీ విషయం తీసుకుంటే కాంగ్రెస్ పొత్తు విలీనం అంటూ వేసిన ఎత్తులకు ఆదిలోనే చిత్తు అయిపోయింది. పుణ్యకాలం అంతా గడచిపోయాక చెల్లెమ్మ పాలేరులో పోటీ అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ నుంచి గండర గండ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారు. బీయారెస్ నుంచి కందాలా ఉపేందర్ రెడ్డి ఢీ కొడుతున్నారు. ఇలా పాలేరు లో భీకరమైన పోరు అధికార ప్రతిపక్షాల నడుమ సాగుతున్న వేళ ముఖా ముఖీ పోరు అన్నట్లుగా సీన్ ఉంటే షర్మిల మాత్రం పాలేరు నా సీటు అంటున్నారు. దాంతో ఈ సీటు విషయంలో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.