"వై.ఎస్.ఆర్. పార్టీ"కి షర్మిళ కొత్త ఎబ్రివేషన్.. కామెంట్స్ వైరల్!
ఇక రాష్ట్ర సమస్యల ప్రస్థావన పేరు చెప్పి జగన్ & కో పై సెటరిర్లు పేలుస్తున్నారు. ఈ సమయంలో తాజాగా... వై.ఎస్.ఆర్. పార్టీ అంటే... అంటూ ముగ్గురు వ్యక్తుల పేరు చెప్పారు.
ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ అధికార వైసీపీని వెంటాడుతున్నారు షర్మిళ. ఇందులో భాగంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏపీలో అభివృద్ధి కంటికి కనిపించడం లేదు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ఖజానాలో డబ్బులు లేవు అంటూ ఫైరయిన ఆమె.. రాష్ట్ర పర్యటన చేపట్టిన సందర్భంగా మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా వైఎస్సార్ పార్టీ అంటే ముగ్గురు వ్యక్తులే అన్నట్లుగా ఆమె సెటైర్లు వేశారు.
అవును... రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టిన ఏపీసీసీ చీఫ్ షర్మిళ... వెళ్లిన ప్రతీ చోటా, మైకందుకున్న ప్రతీ సందర్భంలోనూ వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క ప్రత్యేక హోదా పేరు చెప్పి అటు బీజేపీతో కలిపి వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ఆమె... ఇక రాష్ట్ర సమస్యల ప్రస్థావన పేరు చెప్పి జగన్ & కో పై సెటరిర్లు పేలుస్తున్నారు. ఈ సమయంలో తాజాగా... వై.ఎస్.ఆర్. పార్టీ అంటే... అంటూ ముగ్గురు వ్యక్తుల పేరు చెప్పారు.
అందులో ఒకటి వైవీ సుబ్బరెడ్డి కాగా... మిగిలిన ఇద్దరూ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కావడం గమనార్హం. ఇందులో భాగంగా... వై అంటే - వైవీ... ఎస్ అంటే - సాయిరెడ్డి... ఆర్ అంటే - రామకృష్ణారెడ్డి అని షర్మిళ సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతుంటే వైసీపీ వారంతా తనపై ముప్పేట దాడి చేస్తున్నారని షర్మిళ చెప్పడం గమనార్హం.
ఇక తాజాగా మద్దిపాడులోని గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించిన షర్మిల ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద వైఎస్సార్ నిర్మిస్తే.. జగన్ సర్కారు దానిని నిర్వహణ కూడా చేయలేకపోతోందని అన్నారు. గేట్లు ఊడిపోయినా పట్టించుకోని వారా ఆయన ఆశయాలు నిలబెట్టేది? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో... వైఎస్ హయాంలో 70 శాతం పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేదని మొదలుపెట్టిన షర్మిల... నీటిపారుదల శాఖ మంత్రి సంక్రాంతికి డ్యాన్స్ లు వేయడమే తప్ప.. ప్రాజెక్టుల బాగోగులను చూడటం లేదని విమర్శించారు. జగన్ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమైనా రాలేదని విమర్శించారు.
కాగా... తాజాగా బీజేపీ పైనా సెటైర్లు వేసిన షర్మిల... బీజేపీలో బీ అంటే - బాబు... జే అంటే - జగన్... పీ అంటే – పవన్ అని సెటైర్స్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురినీ ఒకే గాటిన కడుతూ... వీరంతా బీజేపీ అనుచరులు అన్నట్లుగా షర్మిల విమర్శించారు.