షర్మిళ పాలిటిక్స్... టీడీపీ-జనసేన సహకారంతో సౌభాగ్యమ్మ?

అవును... ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరుగుతున్న పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Update: 2024-01-31 06:55 GMT

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో వైఎస్ షర్మిల సరికొత్త రాజకీయానికి తెరలేపారని తెలుస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంగతి దేవుడెరుగు.. వైసీపీకి తనవల్ల అయినంత మేర డ్యామేజ్ చేయాలని భావిస్తున్నట్లున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రధానంగా కడప కేంద్రంగా వైసీపీకి షాక్ ఇవ్వాలని ఆమె తాపత్రయపడుతున్నట్లు సమాచారం!

అవును... ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరుగుతున్న పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వైఎస్ జగన్ ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వైఎస్ షర్మిళ పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకున్న బలంతోనో.. జగన్ రాజకీయ ప్రత్యర్థుల సహాయ సహకారాలతోనో.. ఏలాగైనా అధికార వైసీపీకి అధికారం దూరం చేయడంలో తన పాత్ర తాను పోషించాలని షర్మిళ భావిస్తున్నారని అంటున్నారు.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అయినప్పుడే ఈ విషయంపై కొంతమందికి క్లారిటీ వచ్చినప్పటికీ... ఏపీ పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఇప్పుడు చేస్తున్న స్థాయిలో మాత్రం ఉండకపోవచ్చని పలువురు భావించి ఉండొచ్చు. అయితే... "అంతకు మించి" అన్నట్లుగా షర్మిళ ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కడప జిల్లాలో వైఎస్ జగన్ కు చెక్ పెట్టాలని షర్మిళ భావిస్తున్నారని.. ఇందుకోసం సౌభాగ్యమ్మను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలతో వైఎస్ అవినాష్ రెడ్డిపైనా బలమైన ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... సౌభాగ్యమ్మను అవినాష్ పైకి పోటీకి దింపాలని, ఫలితంగా జగన్ కు షాకివ్వడానికి తనవంతు రాజకీయం తాను చేయాలని షర్మిళ భావించారని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి సౌభాగ్యమ్మను పోటీలోకి దించబోతున్నారని అంటున్నారు.

ఈ విషయంపై తాజాగా కడపలో జరిగిన భేటీలో వైఎస్ షర్మిళ, వైఎస్ వివేకా కుమార్తె సునీత సుమారు రెండు గంటల పాటు చర్చించి మరీ ఒక నిర్ణయానికి వచ్చారని.. ముందుగా పులివెందుల అసెంబ్లీ నుంచి బరిలోకి దించాలనుకుని విరమించుకున్నారని చెబుతున్నారు. దీంతో... కడప ఎంపీ స్థానం అయితే బాగుటుందని.. సెంటిమెంట్ ఎక్కువగా వర్కవుట్ అయ్యే అవకాశలున్నాయని భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ఈ సమయంలో... అవసరం అయితే సౌభాగ్యమ్మను ఎట్టిపరిస్థితుల్లోనూ కడప ఎంపీగా గెలిపించుకునేందుకు టీడీపీ - జనసేన కూటమి సాయాన్ని కూడా కోరి మరీ బరిలోకి దిగాలని మరీ షర్మిళ భావిస్తున్నారని అంటున్నారు. మరి ఈ "ఉమ్మడి" పొలిటికల్ స్కెచ్ ఏమేరకు వర్కవుట్ అవుతుంది.. ఎలాంటి పరిణామాలకు తెరతీస్తుంది అనేది వేచి చూడాలి!


Tags:    

Similar News