కొత్త సమస్య ''షిఫ్ట్ షాక్''... ఎలా అదిగమించాలి?

అవును... ప్రస్తుతం టెక్ వర్గాల్లో "షిఫ్ట్ షాక్" అనే పదం బాగా ట్రెండ్ అవుతుందని అంటున్నారు

Update: 2024-04-15 07:35 GMT

కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోం విధానానికి అలవాటుపడిన చాలా మందికి.. అనంతరం ఆఫీసులకు వెళ్లడం తీవ్ర అసౌకర్యంగా ఉంటుందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో అనేక రకాల కొత్త కొత్త విషయాలు ట్రెండింగ్ అవుతున్నాయి. వీటిలో నిన్నమొన్నటివరకూ "కాఫీ బ్యాడ్జింగ్" ట్రెండింగ్ లో ఉండగా.. ఇప్పుడు తాజాగా "షిఫ్ట్ షాక్" అనే విషయం ట్రెండ్ అవుతుంది!

అవును... ప్రస్తుతం టెక్ వర్గాల్లో "షిఫ్ట్ షాక్" అనే పదం బాగా ట్రెండ్ అవుతుందని అంటున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తమ ఉద్యోగాలను విడిచిపెట్టిన సుమారు 72% మంది ఉద్యొగులు తమ కొత్త ఉద్యోగం లేదా యజమాని, పనిచేస్తున్న ప్రదేశం తాము ఊహించినట్లుగా లేరని భావించారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయని అంటున్నారు.

ఇలా... కొత్త ఉద్యోగం, కొత్త కంపెనీలో వాస్తవానికీ అంచనాలకూ మధ్య వ్యత్యాస భావనను "ది మ్యూస్" సీఈఓ అయిన కాథరిన్ మిన్‌ ష్యూ "షిఫ్ట్ షాక్" అని లేబుల్ చేసారు. ఈ క్రమంలో... తరచుగా ఉద్యోగులు గణనీయమైన మార్పులను ఎదుర్కొంటున్నప్పుడు వారు అనుభవించే భావోద్వేగ అల్లకల్లోలమే షిఫ్ట్ షాక్ అని నిర్వచించారు!

సరైన గైడెన్స్ లేదా పరివర్తన లేకుండా ఒక ఉద్యోగి చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగం, ప్రాజెక్టు నుంచి పూర్తిగా కొత్త, తెలియని పనికి తిరిగి కేటాయించబడితే వారు 'షిఫ్ట్ షాక్'ని అనుభవించవచ్చని చెబుతున్నారు. ఈ ఆకస్మిక మార్పు ఒత్తిడికి దారి తీస్తుందని.. ఉత్పాదకత తగ్గుతుందని చెబుతున్నారు.

అయితే... ఈ విషయంలో కంపెనీలు, కొత్త కొలీగ్స్ నుంచి సహకారం ఉంటే.. బయటపడొచ్చని చెబుతున్నారు పరిశీలకులు! కొత్త ప్రదేశంలో, కొత్త ఉద్యోగానికి వెళ్లినప్పుడు.. కొలీగ్స్ తో వీలైనంత త్వరగా కలిస్పోవాలని.. కలుపుగోలు తనం, సహకారం ఎంత ఎక్కువగా ఉంటే ఈ సమస్య నుంచి అంత తొందరగా బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News