షాకింగ్ సర్వే... భారత్ లో ప్రతీ 16.6 నిమిషాలకో అత్యాచారం!
అవును... దేశవ్యాప్తంగా ప్రతీ రోజు.. క్షమించాలి.. దాదాపుగా ప్రతీ పావుగంటకూ ఓ అత్యాచారం జరుతుందనే సంగతి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఆజీ కేర్ హాస్పటల్ లో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు సంబంధించిన షాకింగ్ న్యూస్ గతకొన్ని రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహరంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. నిందితుడిని ఉరి తీయాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ నేరం వెనుక దుర్మార్గపు కుట్ర దాగుందనే ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), సుప్రీంకోర్టు ఎంట్రీ ఇచ్చాయి. ఆ సంగతి అలా ఉంటే... భారతదేశంలో.. ప్రధానంగా పని ప్రదేశాల్లో మహిళల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి.
అవును... దేశవ్యాప్తంగా ప్రతీ రోజు.. క్షమించాలి.. దాదాపుగా ప్రతీ పావుగంటకూ ఓ అత్యాచారం జరుతుందనే సంగతి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దేశాన్ని మహిళతో పోలుస్తూ... భారతమాత అని చెప్పుకునే ఇక్కడ జరుగుతున్న అత్యాచార ఘటనల లెక్కలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) - 2022 సర్వే వివరాలు ఒకసారి పరిశీలిస్తే... 2012 నిర్భయ కేసు అనంతరం భారతదేశంలో మహిళల భద్రత నిజంగా మెరుగుపడిందా అనే సందేహం బలంగా తెరపైకి వస్తోంది. ఈ సర్వేలో వెలువడిన షాకింగ్ విషయాలు భారతదేశంలో తమ కుమార్తెలు సురక్షితమేనా అనే సందేహాలను లేవనెత్తుతున్నాయన్నా అతిశయోక్తికాదేమో.
ఎన్సీఆర్బీ 2022 సర్వే ప్రకరం.. భారతదేశంలో ప్రతీ 16.6 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది. ఈ ఒక్క షాకింగ్ విషయం చాలు భారతదేశంలో మహిళల రక్షణపై ప్రజలకు ఆందోళన కలగడానికి. ఇక రాష్ట్రవ్యాప్తంగా తెరపైకి వచిన ఘణాంకాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సరాసరిన రోజుకు రెండు అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు! ఇందులో భాగంగా... తెలంగాణలో ప్రతీ 10 గంటల 45 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుండగా.. ఏపీలో ప్రతీ 14 గంటల 6 నిమిషాలకూ ఓ అత్యాచారం జరుగుతుంది.
ఇక రాజస్థాన్ లో ప్రతీ 1 గంటా 37 నిమిషాలకు.. మధ్యప్రదేశ్ లో 2 గంటల 53 నిమిషాలకు ఒక అత్యాచారం ఘటన జరుగుతుందని సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే... లక్షద్వీప్ లో 91 రోజుల 6 గంటలు.. నాగాలాండ్ లో 52 రోజుల 3 గంటలకు.. పుదుచ్చేరిలో 40 రోజుల 13 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నట్లు చెబుతున్నారు.
అంటే దేశంలో రాష్ట్రం ఏదైనా, ప్రాంతం మరేదైనా మహిళలపై అత్యాచారాలు మాత్రం కామన్ అని చెప్పేలా ఉన్న ఈ ఘణాంకాలు కచ్చితంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయనే చెప్పాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.