మద్యం తాగే మహిళలకు షాకింగ్ న్యూస్ చెప్పిన తాజా అధ్యయనం!

ఈ సమయంలో... ఆల్కహాల్ అధికంగా తీసుకునే మహిళలకు కీలకమైన వ్యాదులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Update: 2024-04-02 04:44 GMT

మద్యం సేవించే వారిలో స్త్రీల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంటుంది.. పురుషుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది అనేది నిన్నటి మాట అని చెబుతుంటాయి గణాంకాలు! ప్రస్తుత సమాజంలో.. మారుతున్న లైఫ్ స్టైల్లో స్త్రీపురుషులిద్దరూ బహిరంగంగానే మద్యం సేవిస్తున్నారు.. కాస్త పోటీ పడే అస్వాదిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో... ఆల్కహాల్ అధికంగా తీసుకునే మహిళలకు కీలకమైన వ్యాదులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

అవును... ఆల్కహాల్ అధికంగా తీసుకునే మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 50శాతం పెరుగుతుందనే షాకింగ్ విషయం తాజాగా ఒక అధ్యయనంలో వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. రోజూ ఒకటి కంటే ఎక్కువ డ్రింకులు తాగే మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం సుమారు 50 శాతం పెరుగుతుందని అమెరికా నుంచి ఒక అధ్యయనం వెల్లడించింది!

వివరాళ్లోకి వెళ్తే... 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు గల సుమారు 4,32,265 మందిని అమెరికాలో పరిశీలించారంట. ఈ అధ్యయనంలో ఒకటి కంటే ఎక్కువ పానియాలు తీసుకునే మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలిందంట. వీరిలో చాలా మందికి ఇంతకు ముందు గుండె సంబంధిత వ్యాధి లేదు!

కానీ... రోజూ ఒకటికంటే ఎక్కువ పానియాలు తీసుకోవడం వల్ల ఆ వ్యాధితాలూకు లక్షణాలు కనిపించాయని తేలిందంట. ఈ నేపథ్యంలో... గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ ను సమతుల్యంగా మాత్రమే తీసుకోవాలని హెచ్చరిస్తున్న పరిశోధకులు... రోజుకి ఒకటి కంటే ఎక్కువ డ్రింగ్స్ తీసుకునే మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాధం 33 నుంచి 51 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు!

ఇదే సమయంలో... అప్పుడప్పుడు అధికంగా మద్య సేవించే మహిళల్లోనూ ఈ ప్రమదం 68శాతం వరకూ ఎక్కువగా ఉందని.. అప్పుడప్పుడూ అధికంగా మద్యం సేవించే పురుషులలో గుండె సంబంధిత వ్యాదుల ప్రమాదం కూడా 33 శాతం ఎక్కువగా కనిపించిందని చెబుతున్నారు.

అదే విధంగా... రెడ్ వైన్ లో రెస్ వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంవల్ల మితంగా తీసుకుంటే గుండెకు మేలు జరుగుతాయనై కొన్ని అధ్యయానాలు చెబుతున్న వేళ... తాజా అధ్యయన ప్రధాన రచయిత డాక్టర్ జమాల్ ఎస్. రాణా మాట్లాడుతూ... మద్యపానం గుండెకు మేలు చేస్తుందనేది చాలా కాలంగా ప్రజల నమ్మకం అని.. అయితే ఆ నమ్మకాన్ని పలు అధ్యయనాలు సవాల్ చేస్తున్నాయని తెలిపారు!

Tags:    

Similar News