చంద్రబాబుని కలిసిన లూథ్రా... "కత్తి పట్టడమే" అంటూ ట్వీట్!

అవును... రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బుధవారం సాయంత్రం కలిశారు

Update: 2023-09-13 12:44 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాకత్ భేటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి కలిసిన సంగతి తెలిసిందే. సుమారు వీరు 40 నిమిషాల పాటు బాబుతో గడిపారు! ఈ క్రమంలో ఈ రోజు లాయర్ లూథ్రా ములాకత్ లో బాబుని కలిశారు.

అవును... రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బుధవారం సాయంత్రం కలిశారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున లూథ్రా వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు కోర్టులో జరిగిన పరిణామాలు చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది.

ఈ రోజు చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా పడటంతో పాటు.. సోమవారం వరకూ సీఐడీ కస్టడీకి ఇవ్వొందంటూ కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తూ బెయిల్ పిటిషన్ ను కూడా వాయిదా వేసిన నేపథ్యంలో ఈ విషయాలపై లూథ్రా... చంద్రబాబుతో చర్చించారని తెలుస్తుంది.

ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు సిద్ధార్థ లూథ్రా తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. "అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తిపట్టడమే. పోరాటానికి ఇదే సరైన విధానం" అంటూ గురుగోవింద్‌ సింగ్‌ సూక్తులు ప్రస్తావిస్తూ లాయర్ లూథ్రా ట్వీట్‌ చేశారు.

పంజాబీల గురువు గురు గోబింద్‌ సింగ్‌ అప్పటి మొఘుల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ ను ఉద్దేశించి రాసిన జఫర్‌ నామాలో ఈ మాటలుండగా... దీంతో ఇది వైరల్ అవుతుంది!

Tags:    

Similar News