వారానికే రంగు వెలిసిపోయిన ఒలింపిక్ పతకం.. పోస్ట్ వైరల్!

వివరాళ్లోకి వెళ్తే... పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్ ఇటీవల కాంస్య పతకం సాధించాడు.

Update: 2024-08-10 13:30 GMT

ఈ ఏడాది పారిస్ లో జరుగుతోన్న ఒలింపిక్స్ లో పలు వివాదాలు, ఫిర్యాదులూ తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. 100 గ్రాముల బరువు ఎక్కువుందని వినేశ్ పై అనర్హత వేటు వేయడంపైనా తీవ్ర వివాదం నెలకొందని అంటున్నారు. మరోపక్క అందంగా ఉందని ఓ స్విమ్మర్ ని ఆ దేశం వెనక్కి రప్పించడంపైనా చర్చ జరుగుతుంది! ఈ క్రమంలో మరో షాకింగ్ ఇష్యూ తెరపైకి వచ్చింది.

 

అవును.. పారిస్ లో జరుగుతోన్న ఒలింపిక్స్ లో పలు విషయాలు వివాదాస్పద మవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే... ఒలింపిక్స్ విలేజ్ లో వసతులు సరిగా లేవంటూ ఇప్పటికే చాలా మంది అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ అథ్లెట్ పెట్టి పోస్ట్ వైరల్ గా మారింది. తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ పోస్ట్ ఒలిపిక్స్ నిర్వహణపై విమర్శలకు తావిస్తోందని చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్ ఇటీవల కాంస్య పతకం సాధించాడు. అయితే ఆ పతకం వారం రోజులకే రంగు రంగు వెలిసిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా దాని నాణ్యతపై ప్రశ్నల వర్షం కురిపించాడు. రంగు వెలిసిన ఈ పతకాన్ని చూస్తుంటే... ఏదో యుద్ధానికి వెళ్లివచ్చినట్లుందంటూ కామెంట్ చేశాడు.

ఇదే సమయంలో.. ఈ ఒలింపిక్ పతకం కొత్తగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా కనిపించింది కానీ ఇటీవల కొంత రంగు మారిపోయింది.. దీనిలో అనుకున్నంత నాణ్యత లేనట్లుగా కనిపిస్తుంది.. ఈ పతకాల నాణ్యతను మరింత పెంచితే బాగుంటుంది అని పేర్కొంటూ పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారంపై పారిస్ ఒలింపిక్స్ అధికార ప్రతినిధి స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో.. దీనిపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అదేవిధంగా... డ్యామేజ్ అయిన మెడల్స్ స్థానంలో కొత్త వాటిని ఇచ్చే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో... అడుసు తొక్కనేల కాలు కడుగనేల అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు!

Tags:    

Similar News