రియల్ వైరల్ స్టోరీ: ఏటా రూ.30 లక్షల జీతం.. రైల్లోనే జర్నీలు ఎందుకు?

సోషల్ మీడియాతో ఉన్న సౌలభ్యమే ఇది. మన చుట్టూ ఉన్న కోట్లాది మంది నిత్యం ఎన్నో కొత్త విషయాల్ని తెలుసుకుంటారు.

Update: 2024-08-24 03:53 GMT

సోషల్ మీడియాతో ఉన్న సౌలభ్యమే ఇది. మన చుట్టూ ఉన్న కోట్లాది మంది నిత్యం ఎన్నో కొత్త విషయాల్ని తెలుసుకుంటారు. ఎవరికి వారు తన పరిధిలోని వారికి తమ విషయాల్ని షేర్ చేసుకుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రపంచంతో నేరుగా మాట్లాడే వీలుంది. దీని పుణ్యమా అని దూరాలు తగ్గిపోయి.. అన్నీ.. అందరూ దగ్గరకు వచ్చేసిన పరిస్థితి. షేర్ చేసుకోవాలనుకోవాలే కానీ.. నిమిషాల వ్యవధిలో తాము చెప్పాలనుకున్న సమాచారాన్ని చెప్పేసే వెసులుబాటు ఉంది. తాజాగా అలాంటి పనే చేసిన ఒక వ్యక్తి పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

తాజాగా తాను ట్రైన్ జర్నీలో రూ.30లక్షల జీతం అందుకునే టెకీని కలిశానని.. అంత డబ్బులు సంపాదిస్తూ.. ట్రైన్ ర్నీనే ఎందుకు ఎంచుకుంటున్నారు? అని తాను అడిగితే అతడిచ్చిన సమాధానం ఇదేనంటూ చెప్పిన సంగతులు ఆసక్తికరంగానే కాదు..నిజమే కదా? అన్న భావన కలిగేలా చేస్తాయి. ఇంతకూ ఈ రియల్ స్టోరీని చెప్పిన ఆ వ్యక్తి ఎవరంటే.. చిరాగ్ దేశ్ ముఖ్. ఈ యువకుడు కూడా టెకీనే. తనకు ఎదురైన అనుభవాల్ని.. ముచ్చట్లను తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంటూ ఉంటాడు.

తాజాగా చిరాగ్ తన అనుభవాన్ని ఆసక్తికరంగా వెల్లడించాడు. ‘‘ట్రైన్ జర్నీలో ఒక ప్రముఖ కంపెనీలో ఐటీ డెవలపర్ గా పని చేస్తున్న వ్యక్తిని కలిశా. అతడి వార్షిక ప్యాకేజీ రూ.30 లక్షలు. ఏడాదికి ఇన్ని లక్షలు సంపాదిస్తున్నావు. ఇంకా ట్రైన్ జర్నీలే చేస్తున్నావేంటి? అంటూ ప్రశ్నించా. దీనికి ఆ టెకీ బదులిచ్చాడు. తన చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డాను. అప్పట్లో ఒకసారి ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక అన్నయ్య పరిచయమయ్యాడు. అతని కారణంగానే నాకు జాబ్ వచ్చింది. ఆ సమయంలోనే అనుకున్నా.. ఎప్పుడూ ట్రైన్ జర్నీ చేయాలని’’ అని తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు.

చిరాగ్ షేర్ చేసిన స్టోరీ వైరల్ గా మారింది. ఈ స్టోరీని చదివిన వారు రియాక్టు అవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. విమాన ప్రయాణంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోరని.. కానీ ట్రైన్ జర్నీ అలా కాదని.. ఒకరితో ఒకరు మాట్లాడతారని.. తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. నిజమే.. ట్రైన్ జర్నీ గంటల కొద్దీ సాగుతుంటుంది. కానీ.. ఫ్లైట్ జర్నీ తక్కువ వ్యవధిలో ముగుస్తుంది. దీనికి తోడు.. విమాన ప్రయాణాల్లో ముచ్చట్లు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపరన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News