మరోసారి గొప్ప మనసు చాటిన సోనూసూద్.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం

ఏపీకి రూ.2.5 కోట్ల, తెలంగాణకు రూ.2.5 కోట్లు ఇచ్చారు. ఇప్పటికే వరద బాధితులు సాయం కోసం తమను సంప్రదించాలని సూచించారు.

Update: 2024-09-08 07:08 GMT

సోనూసూద్.. ఆయన రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనే హీరో. ప్రజలకు ఆపద వచ్చిందంటే చాలు క్షణం కూడా ఆలోచించకుండా తనవంతు సాయం అందిస్తారు. ఆపదలో ఆపద్బాంధవుడు అవుతాడు. అక్కడ ఇక్కడ అని కాదు.. ఏ రాష్ట్రానికి కష్టాలు వచ్చినా.. అక్కడ వాలిపోతారు.

కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను అందరం చూశాం. దేశవ్యాప్తంగా కరోనా కంగారు పెట్టిస్తుంటే.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సోనూసూద్ మాత్రం తన సేవా కార్యక్రమాలతో లక్షలాది మంది ప్రజలకు అండగా నిలిచారు. కొందరికి వ్యాపారాలు పెట్టించారు. మరికొందరికి ఆర్థిక సహాయం అందించారు. ఇంకొందరికి ప్రాణాలు పోశారు. అంతేకాదు.. తన ట్రస్ట్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేశారు. కరోనా సమయంలో ఆయన రియల్ ఫైటర్ అనిపించుకున్నారు. ఎంతో మందికి సెకండ్ లైఫ్ ఇచ్చారు.

వారం క్రితం తెలుగు రాష్ట్రాలు వరదలో చిక్కుకుపోయాయి. ఏపీలో విజయవాడ, తెలంగాణ ఖమ్మం, వరంగల్ జిల్లాలు వరద బారిన పడ్డాయి. ప్రజలు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇళ్లలోకి వెళ్లే పరిస్థితి లేక.. పంటలు చెడిపోయి ఇప్పుడు అంధకారంలో బతుకుతున్నారు. వర్షం సృష్టించిన బీభత్సానికి వందలాది కుటుంబాలు ఆగం అయ్యాయి.

ఏ ఆపద వచ్చినా స్పందించే సోనూసూద్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల ఇబ్బందులపై చలించారు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఏపీకి రూ.2.5 కోట్ల, తెలంగాణకు రూ.2.5 కోట్లు ఇచ్చారు. ఇప్పటికే వరద బాధితులు సాయం కోసం తమను సంప్రదించాలని సూచించారు. supportus@soodcharityfoundation.org ను సంప్రదించాలని కోరారు. మరోసారి గొప్పమనసు చాటిన సోనూసూద్‌ను యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు అభినందిస్తున్నారు. ఆయన సేవలను కొనయాడుతున్నారు.

Tags:    

Similar News