మదర్స్ డే ఆవిర్భావానికి కారణాలేంటి?

దీనికి స్ఫూర్తి అన్నా జార్విస్. 1907 మే 12న అమెరికన్ మహిళ అన్నా జార్విస్ తన తల్లి కోసం ఒకే మెమోరియల్ సర్వీస్ నిర్వహించడంతో మదర్స్ డే ఆలోచన మొదలైంది.

Update: 2024-05-12 06:03 GMT

లోకంలో అమ్మను మించిన ప్రేమ ఉండదు. అమ్మను మించిన దైవం ఉండదు. అమ్మంటే ఒక నమ్మకం. ఒక మార్గదర్శనం. బతుకు గమనంలో అమ్మ నేర్పిన అడుగులే మనకు మెట్లుగా మారతాయి. అమ్మ చూపిన ప్రేమనే మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మనలోని మంచిని తట్టి లేపేది అమ్మ ప్రేరణే. అమ్మ లేని వాడు ఆగమాగం అవడం ఖాయం. అదే తల్లి చాటు బిడ్డ లోకం గురించి తెలుసుకుంటాడు. తనను తాను అర్థం చేసుకోవడం సహజం.

 

మాత్రు దినోత్సవం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? దీని పుట్టు పూర్వోత్తరాల గురించి పరిశీలిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి సుమారు 117 ఏళ్ల కిందట ఈ మదర్స్ డే మొదలైందని తెలుస్తోంది. దీనికి స్ఫూర్తి అన్నా జార్విస్. 1907 మే 12న అమెరికన్ మహిళ అన్నా జార్విస్ తన తల్లి కోసం ఒకే మెమోరియల్ సర్వీస్ నిర్వహించడంతో మదర్స్ డే ఆలోచన మొదలైంది.

ప్రతి ఏటా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో మే నెలలో రెండో ఆదివారం అమ్మను గుర్తు చేసుకునేందుకు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. 1914లో అప్పటి అమెరికా అధ్యక్షుడు దీన్ని సెలవు దినంగా ప్రకటించారు. అన్నా జార్విస్ 13 మంది సంతానంలో ఒకరు కావడం గమనార్హం. తొమ్మిది మంది చిన్నప్పుడే చనిపోవడంతో మిగిలిన నలుగురికే పిల్లలున్నారు.

అన్నా జార్విస్ ఇతరుల జీవితాలు మెరుగుపడేలా అమ్మలు చేసే పనికి గుర్తింపు ఉండాలని మదర్స్ డే జరపాలని భావించింది. మదర్ డే అని ఏకవచనంతో కాకుండా మదర్స్ డే అని బహువచనంతో పిలిచి తన తల్లికి తన జీవితాన్ని అంకితం చేసింది. 1905లో అన్నా జార్విస్ మరణం తరువాత 1908లో తొలిసారి గ్రాప్టన్ మెథడిస్ట్ చర్చిలో మే రెండో ఆదివారం మదర్స్ డేగా జరుపుకున్నారు.

1914లో అమెరికా వ్యాప్తంగా మదర్స్ డేను సెలవు దినంగా ప్రకటించారు. అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఈ వేడుకలను ప్రారంభించారు. గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్ల, బొకేలు, బహుమతులు పంచడంతో వాణిజ్య పండుగగా గుర్తింపు పొందింది. ఇలా మదర్స్ డే ఆవిర్భావానికి కారణంగా నిలిచింది. మే నెల రెండో ఆదివారం మదర్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

Tags:    

Similar News