దివాలా ద్వీప దేశం.. బాగుపడేందుకు భలే ఐడియా
గత ఏడాది డిసెంబరు నాటికి బ్రిక్స్ లోని 5 దేశాల జనాభా 324 కోట్లు. జీడీపీ 26 ట్రిలియన్ డాలర్లు.
మితిమీరిన సంక్షేమం.. సాధ్యం కాని విధానాలు.. ఆదాయ వనరులపై నిర్లక్ష్యం.. రాజకీయ అవినీతి భూతం.. వెరసి ఆ ద్వీప దేశం దివాలా తీసింది. ప్రజలు దండయాత్ర చేయడంతో పాలకుడు పారిపోవాల్సి వచ్చింది. ఇక మిగిలింది ఆర్థికంగా కోలుకోవడం. ఇరుగు పొరుగు దేశాల నుంచి సాయం పొందుతూ నిలదొక్కుకోవడం.
జి-7కు దీటుగా..
ప్రపంచంలో బాగా డెవలప్ చెందిన దేశాల కూటమి జి-7. ఈ కూటమి. మరి డెవలప్ అవుతున్న, థర్డ్ వరల్డ్ కంట్రీస్ గా పేరున్న దేశాలకు ఓ కూటమి ఉందా..? ఇలాంటి ఆలోచన నుంచి పుట్టిందే బ్రిక్. 2006లో డెవలపింగ్ కంట్రీస్ అయిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో కలిసి ఇది ఏర్పడింది. రాజకీయ, భద్రత, ఆర్థిక, వాణిజ్య, కలర్చల్, మానవత్వ సాయంలో పరస్పర సహకరం కోసం బ్రిక్స్ పనిచేస్తోంది. అయితే, 2010లో దీనిలోకి దక్షిణాఫ్రికా (సౌత్ ఆఫ్రికా) కూడా చేరడంతో బ్రిక్స్ అయింది. కాగా, జనవరిలో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఈఏ కూడా చేరడంతో బ్రిక్స్ ప్లస్ గా మార్చాలని చూస్తున్నారు.
ఇదీ ప్రాధాన్యం..
గత ఏడాది డిసెంబరు నాటికి బ్రిక్స్ లోని 5 దేశాల జనాభా 324 కోట్లు. జీడీపీ 26 ట్రిలియన్ డాలర్లు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 26 శాతానికి సమానం. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల్లో డెవలపింగ్ దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు బ్రిక్స్ పాటుపడుతోంది.
నేనూ చేరతానంటున్న శ్రీలంక..
ఆర్థికంగా బలంగా కనిపిస్తున్న బ్రిక్స్ లో తానూ చేరతానంటోంది శ్రీలంక. పేద దేశాలకు రుణాలు ఇవ్వడం కోసం రూ.20.78 లక్షల కోట్లతో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ను ఏర్పాటు చేశాయి. దీంతో శ్రీలంక కూడా చేరేందుకు ఉత్సాహంగా ఉంది. దరఖాస్తు చేసుకునేందుకు మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటుచేయనుంది. అయితే, బ్రిక్స్ లో చేరాలంటూ భారత్ మద్దతు ముఖ్యం. ఇదే దిశగా తాము ప్రయత్నం చేస్తున్నట్లు లంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. భారత్ భాగంగా ఉన్న బ్రిక్స్ కూటమిని బలంగా విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు.
లంక ఆర్థికంగా దివాలా తీసిన నేపథ్యంలో బ్రిక్స్ లో చేరడం ద్వారా రుణాలు పొంది బయటపడే ప్రయత్నం చేయొచ్చు.