ట్రంప్ పై మాజీ మోడల్ గ్రోపింగ్ ఆరోపణలు... హారిస్ టీమ్ కి ఫోన్!

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమైన రిపబ్లిక అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై పలు లైంగిక ఆరోపణలు ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-24 13:30 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతుంది. నవంబర్ 5న జరగబోయే ఎన్నికపై అమెరికన్స్ తో పాటు ప్రపంచ దేశాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి! ఈ సమయంలో కమలా హారిస్, ట్రంప్ లు తమ తమ ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఈ సమయంలో ట్రంప్ పై ఓ మాజీ మోడల్ సంచలన ఆరోపణలు చేశారు!

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమైన రిపబ్లిక అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై పలు లైంగిక ఆరోపణలు ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో న్యూయార్క్ కోర్టు డొనాల్డ్ ట్రంప్ ను దోషిగా తేల్చింది. 5 మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది.

ఇదే సమయంలో... శృంగార తార స్టార్మీ డెనియల్ తో ఏకాంతంగా గడిపారని, ఈ విషయంపై నోరు విప్పకుండా ఉండటం కోసం ఆమెతో అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారనే కేసులోనూ ట్రంప్ దోషిగా తేలారు. ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్ పై మాజీ మోడల్ ఒకరు అసభ్యకరంగా తాకినట్లు (గ్రోపింగ్) వెల్లడించారు.

ఇందులో భాగంగా... స్టాసీ విలియమ్స్ అనే మాజీ మోడల్ కు 1992లో ట్రంప్ తో పరిచయం ఏర్పడిందంట. ఆ సమయంలో... ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్ స్టీన్ తో ఆమె డేటింగ్ లో ఉన్నారట. ఈ నేపథ్యంలో ఓ పార్టీలో ఆమెను ట్రంప్ కు పరిచయం చేశారట జెఫ్రీ. ఈ పరిచయం అనంతరం.. ట్రంప్ చేసిన పనిని ఆమె తాజాగా హారిస్ ప్రచార బృందానికి తెలిపారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా..."అలా పరిచయం అయిన కొన్ని రోజుల తర్వాత ఓ రోజు నన్ను జెఫ్రీ.. న్యూయార్క్ లోని ట్రంప్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో నన్ను చూసి జెఫ్రీ, ట్రంప్ నవ్వుకున్నారు. ఆ సమయంలో ట్రంప్ నన్ను తనవైపు లాక్కొన్ని, ఎంతో అసభ్యంగా తాకారు" అని కమలా హారిస్ ప్రచార బృందానికి ఫోన్ చేసి చెప్పారంట స్టాసీ.

ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ "ది గార్డియన్" పత్రిక కథనం పేర్కొంది. దీంతో... ఈ వ్యవహారం ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారింది. అయితే.. దీనిపై స్పందించిన ట్రంప్ ప్రచార బృందం.. ఇదంతా ఓ కట్టుకథ అని కొట్టిపారేసింది.

Tags:    

Similar News