తుఫాన్లు.. పేర్లు.. వాటి వెనుక ఉన్న ఇంట్రస్టింగ్ స్టోరీలు తెలుసా?
ప్రకృతిలో తుఫాన్లు సహజం. సముద్ర ఉత్పరివర్తనాల కారణంగా చోటు చేసుకునే ఆటు పోట్ల నుంచి తుఫాన్లు ఉద్బవిస్తాయి. అయితే.. ఇటీవల కాలంలో తుఫాన్లకు పేర్లు పెడుతున్నారు.
ప్రకృతిలో తుఫాన్లు సహజం. సముద్ర ఉత్పరివర్తనాల కారణంగా చోటు చేసుకునే ఆటు పోట్ల నుంచి తుఫాన్లు ఉద్బవిస్తాయి. అయితే.. ఇటీవల కాలంలో తుఫాన్లకు పేర్లు పెడుతున్నారు. ఈ సంప్రదాయం... గత 15 ఏళ్ల నుంచే కొనసాగుతోంది. ఇంతకు ముందు ఇలాంటి సంప్రదాయాలు లేవనే చెప్పాలి. ప్రస్తుతం మిచౌంగ్ తుఫాను..ఏపీ సహా.. పొరుగు దేశాలను కూడా అతలాకుతలం చేస్తోంది. చెన్నై నగరం.. తుడిచి పెట్టుకుపోయింది.
గతంలో తిత్లీ, హుద్‌హుద్ వంటి తుఫాన్లు కూడా వచ్చాయి. హుద్‌హుద్ తుఫాను ధాటికి.. విశాఖ మొత్తం నామరూపాలు లేకుండా పోయిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. దీంతో విశాఖను వాయు వేగ మనోవేగాలతో తిరిగి.. డెవలప్ చేశారు. ఇక, తిత్లీ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను అతలాకుతలం చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 8 రాష్ట్రాలు తీర ప్రాంతంలో ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు తుఫానుల బెడద సర్వసాధారణంగా మారింది.
వీటిలో ఏపీ, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా వంటి కీలక రాష్ట్రాలు ఉన్నాయి. అయితే.. తుఫాన్లకు పేరు పెట్టడం అనేది.. ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. అయితే.. వీటికి పేర్లు ఎలా వచ్చాయంటే.. ఆయా ప్రాంతాల్లో ప్రభావం చూపించే దేశాలు.. వాటి తీవ్రతను బట్టి.. పేర్లు పెడుతుంటాయి. తిత్లీ తుఫాను సాధారణ పరిణామంలోనే ఉంటుంది.. కాబట్టి ఆ పేరు వచ్చింది. తిత్లీ.. అంటే.. ఒకింత సాధారణం.. మరింత ప్రమాదకరం అని అర్థం.
ఇక, హుద్‌హుద్ తుఫానుకు భారత్ పేరు పెట్టింది. ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కావడంతో భారతే ఈ పేరును సూచించింది. ప్రస్తుతం వచ్చిన మిచౌంగ్ తుఫానుకు.. బంగ్లాదేశ్ పేరు పెట్టింది. మిచౌంగ్ అనేది బంగ్లా పేరు. ఇది స్థితిస్థాపకతలో వేగం, ఉత్పరివర్తనాన్ని సూచిస్తుంది. ఏదేమైనా.. సముద్ర తీర ప్రాంత దేశాలు.. ఆయా తుఫాన్ల ప్రభావాన్ని అంచనా వేసి.. హెచ్చిరికల కోసం.. ఈ పేర్లు పెడుతుండడం గమనార్హం.