ఫోన్ పక్కకు పెట్టి చదువుకోమంటే... 15 ఏళ్ల విద్యార్థి అంతపని చేశాడు!
అంతే... కోపంతో ఇంటికి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆ విద్యార్థి. అనంతరం సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు మనిషి జీవితంలో ఒక భాగం, దైనందిన జీవితంలో ఒక అంశం మాత్రమే కాదు... ఏకంగా మనిషి శరీరంలో ఒక భాగమైపోయిందన్నా అతిశయోక్తి కాదేమో. ఈ క్రమంలో ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలు పూర్తిగా ఫోన్ లకు అడిక్ట్ అవుతున్నారని.. అందులో ఆడుతున్న కొన్ని గేంస్ వల్ల మానసికంగా వయసుకు మించిన ఒత్తిడికి గురవుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో వారు తీసుకునే నిర్ణయాలు అత్యంత దారుణంగా ఉంటున్నాయి!
అవును... మొబైల్ ఫోన్స్ కి చదువుకుంటున్న పిల్లలు పూర్తిగా అడిక్ట్ అవుతుండటం ఇటీవల కాలంలో మరీ ఎక్కువైపోయింది! ఇందులో భాగంగా చదువు పక్కకు పోవడం ఒకెత్తు అయితే... వారు మానసికంగా చాల సంకుచిత మనస్థత్వానికి బలైపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫోన్ వాడొద్దని తల్లితండ్రులు మందలించడంతో ఒక కుర్రాడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు!
వివరళ్లోకి వెళ్తే... చిక్కబళ్లాపూర్ జిల్లా గౌరిబిదనూరు సమీపంలోని చిట్టవలహళ్లి గ్రామానికి చెందిన 15 ఏళ్ల విద్యార్థిని తల్లితండ్రులు మందలించారు. ఎప్పుడు చూసినా ఫోంతోనే ఉంటావేంట్రా అని అడిగారు. ఇందులో భాగంగా ఎంతసెలవూ రోజైతే మాత్రం ఇంక పగలూ రాత్రీ ఫోనేనా అంటూ ఆదివారం ఫోన్ పక్కకు పెట్టి.. చదువుకోమని తల్లిదండ్రులు మందలించారని తెలుస్తుంది.
అంతే... కోపంతో ఇంటికి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆ విద్యార్థి. అనంతరం సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 15ఏళ్ల కుమారుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఆ తల్లితండ్రుల ఆవేదన తీవ్రస్థాయికి చేరుకుంది.
కాగా... ఆ విద్యార్థి తండ్రి రైతు.. తనలా తన కొడుకు కష్టపడకూడని భావించిన ఆ తండ్రి కొడుకు బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం చేయాలనీ భావించాడట. కష్టపడి చదివిస్తున్నాడంట. ఈ పరిస్థితుల్లో తన కొడుకు మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని కోరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ మాత్రం దానికే ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో... కారణం ఏదైనా.. సమస్య ఎంత పెద్దదైనా సరే పరిస్థితులతో పోరాడాలి.. అంతేకాని చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోకండి! ఈ సమయంలో ఎవరికైనా ఆత్మహత్య ఆలోచనలు ఉంటే మీ ప్రియమైన వారితో మాట్లాడండి. సాధ్యం కాకపోతే ఆత్మహత్య నివారణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు కాల్ చేయండి అని నిపుణులు సూచిస్తున్నారు.