ఇలాంటి ఆరాచక ప్రేమకథను సినిమాల్లోనూ చూసి ఉండరు

తాజాగా వెలుగు చూసిన అరాచక ప్రేమ గురించి తెలిసినంతనే ఒళ్లు జలదరింపునకు గురి కావటం ఖాయం.

Update: 2023-12-25 23:30 GMT

కాలం మారింది. అభిరుచులు.. అభిప్రాయాలు మారిపోతున్నాయి. ప్రేమ అన్నదెంత సున్నితమన్న స్థానే.. ఎంత కర్కశంగా.. మరెంత అమానుషంగా మారింతో గడిచిన కొన్నేళ్లుగా చోటు చేసుకుంటున్న ప్రేమకథల్ని చూస్తే అర్థమవుతుంది. తాజాగా వెలుగు చూసిన అరాచక ప్రేమ గురించి తెలిసినంతనే ఒళ్లు జలదరింపునకు గురి కావటం ఖాయం. ఇలాంటి అరాచక ప్రేమకథలు కూడా ఉంటాయా? అన్న భావన కలుగక మానదు.

చెన్నై మహానగరంలోని సిరుసేరి సమీపంలోని పొన్మార్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని రీతిలో ఉన్న మనిషిని కాళ్లు.. చేతులు కట్టేసి.. సజీవ దహనం చేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లిన తర్వాత తేలిందేమంటే.. ఆ డెడ్ బాడీ ఒక యువతిదని. అక్కడి నుంచి మొదలైన ట్విస్టులు.. చివరకు వరకు సాగుతూ షాకుల మీద షాకులు ఎదురవుతున్న పరిస్థితి.

యువతి పోస్టుమార్టం చేసే వేళకు.. ఆ యువతి ఎవరన్న విషయంపై స్పష్టత రానప్పటికీ.. చివరకు ఆమె పేరు నందినిగా.. ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్న విషయాన్ని గుర్తించారు పోలీసులు. అయితే.. ఆమెను హత్య చేసిందెవరన్న విషయంపై ఫోకస్ చేసిన పోలీసులు.. ఆమె మాజీ ప్రియుడు వెట్రి మాణిమారన్ ను అనుమానించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

నందిని మాజీ ప్రియుడే ఆమెను అత్యంత కర్కశంగా చంపినట్లుగా గుర్తించారు. ఇంతకూ ఆమెను ఎందుకు చంపావన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. అతడి నోటి నుంచి వచ్చిన ట్విస్టుకు షాక్ తిన్నారు. వెట్రిమారన్ అసలు పేరుపాండి మహేశ్వరి. లింగ మార్పిడి ద్వారా పురుషుడిగా మారినట్లు తెలిపాడు. వెట్రి మణిమారన్ ట్రాన్స్ జెండర్ అన్న విషయాన్ని తెలుసుకున్న నందిని అతడి నుంచి విడిపోయింది. అనంతరం రాహుల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే.. రాహుల్ మీద అప్పటికే మణిమారన్ ప్రేమిస్తున్నాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న నందిని తన మాజీ ప్రియడు మణిమారన్ ను మందలించింది. దీంతో.. ఆమెపై కోపం పెంచుకున్న అతడు.. నందిని పుట్టినరోజును పురస్కరించుకొని ఉదయం గుడికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం హోటల్ కు తీసుకెళ్లి లంచ్ చేశారు. ఆ తర్వాత సర్ ప్రైజ్ గిప్టు ఇస్తానని చెప్పి చెరువుగట్టుకు తీసుకెళ్లాడు. ఆమెను నమ్మించి.. చేతులు కాళ్లను గొలుసులతో కట్టేశాడు. ఆ తర్వాత బ్లేడ్ తో చేతులు..కాళ్లు.. మణికట్టు.. మెడపై కోశాడు. నొప్పి భరించలేక అరుస్తుంటే.. తనతో తెచ్చిన పెట్రోల్ పోసి.. నిప్పు అంటించి చంపేశాడు. తాను ప్రేమించే రాహుల్ ను ఆమె ప్రేమిస్తున్న వైనాన్ని జీర్ణించుకోలేక ఇదంతా చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఇదెక్కడి పైశాచిక ప్రేమా? అంటూ పోలీసులు సైతం షాక్ తింటున్నారు.

Tags:    

Similar News