మోడల్ ఆత్మహత్య... చిక్కుల్లో సన్ రైజర్స్ క్రికెటర్?
ఈ క్రమంలో ఆమె మరణించి రెండు రోజులు గడిచినప్పటికీ ఆ బలవన్మరణానికి గల కారణం తెలియడం లేదని అంటున్నారు.
సూరత్ లోని తన నివాసంలో తాన్యా సింగ్ (28) అనే మోడల్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మరణించి రెండు రోజులు గడిచినప్పటికీ ఆ బలవన్మరణానికి గల కారణం తెలియడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో తాన్యా సింగ్ కాల్ రికార్డులను పరిశీలించగా... చివరిగా ఆమె క్రికెటర్ అభిషేక్ శర్మకు కాల్, మెసేజ్ చేసినట్లు కనుగొన్నారని.. అయితే, ఆ రెండింటికి అతడు స్పందించలేదని గుర్తించినట్లు తెలుస్తుంది.
అవును... తాన్యా సింగ్ - సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మ మధ్య స్నేహాన్ని సూచించే ప్రాథమిక ఆధారాలను కనుగొన్నట్లు అసిస్టెంట్ కమిషనర్ మల్హోత్రా తెలిపారు! వాట్సాప్ లో అభిషేక్ శర్మకు తాన్యా పంపిన సందేశాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. దీంతో.. ఆ వాట్సప్ మెసేజ్ ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఎంత సమయం ముందు పంపింది.. అసలు ఆ మెసేజ్ లో ఏముంది.. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి!
కాగా.. అభిషేక్ శర్మను ఇప్పటి వరకు పోలీసులు సంప్రదించలేదని తెలుస్తుంది. అతడిని విచారించేందుకు, మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నోటీసులు పంపాలని యోచిస్తున్నారని సమాచారం. అయితే... అభిషేక్ శర్మ ఆమె ఫోన్ నంబర్ ను బ్లాక్ చేశాడని.. సోషల్ మీడియాలో సైతం ఆమె మెసేజ్ లకు స్పందించడం లేదని అంటున్నారు.
ఇక.. తాన్యా సింగ్ ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నారు. ఆమె మోడల్ గా పని చేస్తుండటంతోపాటు.. డీజే, మేకప్ ఆర్టిస్ట్ గానూ ఆమెకు అనుభం ఉందని తెలుస్తుంది. దీంతో... సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది! మరోపక్క... పంజాబ్ కు చెందిన అభిషేక్ శర్మ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు.
ఐపీఎల్ లో ఇప్పటివరకూ 47 మ్యాచ్ లు ఆడిన అభిషేక్... 137 స్ట్రైక్ రేట్, 22.90 యావరేజ్ తో 893 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.