యూట్యూబర్ అరెస్ట్ వ్యవహారం... ఎన్నికల వేళ సుప్రీం సంచలన వ్యాఖ్యలు!

ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది!

Update: 2024-04-08 12:34 GMT

ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో జరిగే ఎన్నికల ప్రచారాలు.. ప్రత్యర్థులపై చేసే విమర్శలు.. ప్రభుత్వాలపై కురిపించే ప్రశ్నలు.. ఇదే వేదికలపై నుంచి పలువురు చేసే తప్పుడు ప్రచారాలు వైరల్ గా మారుతుంటాయనేది తెలిసిన విషయమే! ఈ సమయంలో పలువురి అరెస్టులు కూడా జరుగుతుంటాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది!

అవును... తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై విమర్శలు చేశాడనే ఆరోపణలతో అరెస్టైన ఓ యూట్యూబర్ కు సుప్రీంకోర్టు బెయిల్ ను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుతంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా... సోషల్ మీడియాలో విమర్శలు చేసే ప్రతీ ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది. దీంతో.. ఎన్నికల వేళ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడుకు చెందిన యూట్యూబర్ దురై మురుగన్ ను 2021 అక్టోబరు లో పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం స్టాలిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ఆరోపణ. అయితే.. అతడికి బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో... కోర్టు కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడనే కారణంతో 2022లో మద్రాసు హైకోర్టు అతడి బెయిల్ ను రద్దు చేసింది.

దీంతో... మురుగన్ సుప్రీంను ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్ లభించింది. నాటి నుంచీ అతడు బయటే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో... హైకోర్టు రద్దు చేసిన అతడి రెగ్యులర్ బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ మురుగన్ సుప్రీంని ఆశ్రయించాడు. ఈ సందర్భంగా స్పందించిన సుప్రీం.. కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా... యూట్యూబ్‌ లో విమర్శలు చేసిన ప్రతిఒక్కరినీ అరెస్టు చేసుకుంటూపోతే.. ఎన్నికలకు ముందు ఎంతమందిని జైల్లో పెడతారు? అని ప్రశ్నించింది! ఇదే సమయంలో కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను అతడు దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని చెబుతూ... రెగ్యులర్‌ బెయిల్‌ ను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువరించింది.

Tags:    

Similar News