ఎన్నికల కోసం రూ.6,600 కోట్ల స్కామ్ లో సొమ్ము!... ఈడీ కీలక స్టెప్!

‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ క్రిప్టో ఫండ్స్ స్కామ్’ అనే విషయం తీవ్ర సంచలనంగా మరిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-20 16:33 GMT

‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ క్రిప్టో ఫండ్స్ స్కామ్’ అనే విషయం తీవ్ర సంచలనంగా మరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో.. ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేపై బీజేపీ కీలక ఆరోపణలు చేసింది. ఈ సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక స్టెప్ తీసుకుంది.

అవును... మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డే.. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నట్లు ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత సుప్రియా సూలే, నానా పటోలేపై బీజేపీ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.

ఇందులో భాగంగా... మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది పలు ఆడియో క్లిప్ లను వినిపించారు. ఈ సందర్భంగా.. సుప్రియా సూలే, నానా పటోలే, మాజీ పోలీస్ కమిషనర్, ఇతరులతో కలిసి బిట్ కాయిన్ లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో.. ఈ విషయం సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో ఈ స్కామ్ కు సంబంధించి ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో గల ఆడిట్ సంస్థ ఉద్యోగి గౌరవ్ మెహతా నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 2018 క్రిప్టో కరెన్సీ చీటింగ్ కేసులో రవీంద్రనాథ్ పాటిల్ (మాజీ ఐపీఎస్ అధికారి) కీలక సాక్షిగా పేర్కొనడంతో ఈ గౌరవ మెహతా పేరు వెలుగులోకి వచ్చింది.

రూ.6,600 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కామ్ పై పూణే పోలీసులకు దర్యాప్తులో ఆడిట్ సంస్థ కన్సల్టెంట్ అయిన గౌరవ మెహతా సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో.. సుప్రియా సూలే, నానా పటోలే లు గౌరవ్ మెహతాను సంప్రదించారని.. ఎన్నికల సహాయార్థం స్కామ్ తో ముడిపడి ఉన్న బిట్ కాయిన్ ల నుంచి నగదు కోరారాని పాటిల్ పేర్కొన్నారు!

స్పందించిన సుప్రియా సూలే:

ఈ ఆరోపణలపై సుప్రియా సూలే స్పందించారు. ఇందులో భాగంగా... అక్రమ బిట్ కాయిన్ లావాదేవీలకు తాను పాల్పడినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలు అసత్యాలని అన్న్నారు. బిట్ కాయిన్ల గురించి ప్రచారంలో ఉన్న వాయిస్ నోట్స్, మెసేజ్ లు అన్నీ నకిలీవని.. అది తన వాయిస్ కాదని సుప్రియ పేర్కొన్నారు.

కావాలనే బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది తనపై బురదజల్లే ప్రయతనం చేశారని ఆమె విమర్శించారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఎంపీ త్రివేదీకి పరువునష్టం దావా నోటీసులు పంపినట్లు వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి పోలీసులు తనను అరెస్ట్ చేయరనే నమ్మకం ఉందని అన్నారు.

Tags:    

Similar News