గొడుకు పట్టి అడ్డంగా బుక్కైన హీరోయిన్ భర్త!
ముంబై నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తోన్న పహాద్ ఇలా గొడుగు పట్టడంతో? అతడు సొంత ప్రయోజనాల కోసమే ఇలా భజన చేస్తున్నాడని నెటి జనులు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ భర్త పహాద్ అహ్మద్ ట్రోలింగ్ బారిన పడ్డాడు. సమాజ్ వాద్ పార్టీ మహారాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఉన్న పహాద్ ని నెటి జనులు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. అందుకు కారణం ఇలా గొడుగు పట్టడమే. వివరాల్లోకి వెళ్తే ఎన్సీపీ ఎస్ పీ ఎంపీ సుప్రియా సూలేకి పహాద్ గోడుగు పట్టిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మహరాష్ట్రలో ఎన్నికలు వస్తోన్న వేళ మహా వికాస్ అఘాడీ ర్యాలీలో భాగంగా సుప్రియా ప్రసగింస్తున్నారు.
ఈ సమయంలో ఆమెకి పహాద్ ఎండ..వాన తగలకుండా గొడుగు పట్టాడు. ముంబై నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తోన్న పహాద్ ఇలా గొడుగు పట్టడంతో? అతడు సొంత ప్రయోజనాల కోసమే ఇలా భజన చేస్తున్నాడని నెటి జనులు ట్రోలింగ్ మొదలు పెట్టారు. కొత్తగా గొడుగు పట్టే ఉద్యోగంలో చేరాడా? అని ఒకరు..మరొకరు చనిపోయిన హమాస్, హిజ్బుల్లా నాయకులకు సంతాపాలు తెలిపే పని అతడి భార్యకు ఇచ్చారని ఇంకొకరు ట్రోల్ చేస్తున్నారు.
మరికొంత మంది ఎన్సీపీ కోటాలో టికెట్ దక్కించుకుని , సమాజ్ వాద్ పార్టీ కోసం పోరాడుతున్నారని సైటెరికల్గా పోస్టులు పెడుతున్నారు. పనిలో పనిగా స్వరా భాస్కర్ ని కూడా విడిచి పెట్టడం లేదు. భార్య భార్తలిద్దర్నీ కలిపి మరీ ట్రోల్ చేస్తున్నారు. గతంలో హిందు ద్వేషిగా స్వరాభాస్కర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటి జనులకు ఆమె కూడా టార్గెట్ అయింది. మొన్నటి వరకూ ఆమెపైనే ట్రోలింగ్ జరిగింది. అదంతా జనాలు మర్చిపోయేలోపు ఇలా భర్త భజన చేస్తూ దొరికాడు. టైమ్ ఇప్పుడిలా ఇద్దర్నీ టార్గెట్ చేసింది.