జనసేనతో బీజేపీ పొత్తు... పోటీలో ఉండాల్సిందే...!
దాంతో బీజేపీలో వేడి రాజుకుంది. ఏకంగా కేంద్ర మంత్రి టీ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని వారు పవన్ని కోరినట్లుగా ప్రచారం సాగింది.
తెలంగాణా రాజకీయం కీలకమైన ఘడియలలో మలుపు తిరగనుందా అంటే జరుగున్నది చూస్తే అదే అనిపిస్తోంది అని అంటున్నారు. జనసేన 32 సీట్లకు పోటీ చేస్తామని తెలంగాణా ఎన్నికల్లో సత్తా చాటుతామని చాలా కాలం క్రితమే ప్రకటించింది. అలా ప్రకటించింది కూడా స్వయంగా పవన్ కళ్యాణ్. దాంతో జనసేన సీరియస్ గానే ఉంది అని అంతా అనుకున్నారు.
అయితే ఆ ప్రకటన తరువాత జనసేన నుంచి కొంత సైలెన్స్ కనిపించింది. దాంతో పోటీ ఉండదని అనుకున్న వారూ ఉన్నారు ఈ లోగా జనసేన నుంచి పోటీ చేయాల్సిందే. పార్టీ పెట్టి పోటీ చేయకపోతే తెలంగాణాలో ఎప్పటికీ ఎదగమని ఆ పార్టీ వారు పవన్ కళ్యాణ్ కి చెప్పడం జరిగింది.
దాంతో బీజేపీలో వేడి రాజుకుంది. ఏకంగా కేంద్ర మంత్రి టీ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని వారు పవన్ని కోరినట్లుగా ప్రచారం సాగింది. అయితే బీజేపీ నేతలు చెప్పినది విన్న పవన్ కూడా తన మనసులో మాటను, తమ పార్టీ వారు అనుకుంటున్న విషయాలని చెప్పారని అంటున్నారు.
అదేలా అంటే ప్రతీ సారి తాము మద్దతు ఇస్తూనే ఉన్నామని ఆయన గుర్తు చేశారని అంటున్నారు. అది 2014 ఎన్నికల నుంచి అలా కొనసాగుతూ వస్తోందని కూడా తెలిపారని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం తాము పోటీకి దిగాలని అనుకున్న వేళ బీజేపీ మాట మీద తమ పార్టీ వారిని ఒప్పించి విరమింపచేశానని అన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈసారి పోటీ పడాల్సిందే అని క్యాడర్ కోరుతున్న సంగతిని ఆయన బీజేపీ నేతల ముందుంచారని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈసారి బీజేపీతో పొత్తులు ఉంటే ఓకే లేకపోతే ఒంటరిగా పోటీ చేసి తీరాలని తెలంగాణా జనసేన క్యాడర్ అంటోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే జనసేన ఈసారి పోటీ పడడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆ పార్టీ తనను తాను రుజువు చేసుకోవడం కూడా ముఖ్యమైనదిగా ఉంది అంటున్నారు.
దాంతో పవన్ క్యాడర్ మాటకు విలువ ఇస్తారని అంటున్నారు. మరి బీజేపీ ఎపుడూ జనసేనను మద్దతుగా ఉండమని కోరుతూ పోటీకి దూరంగా ఉంచడం పట్ల జనసేనలో అసంతృప్తి కనిపిస్తోంది అని అంటున్నారు. దాంతో పొత్తు ఉండాలనుకుంటే బీజేపీ కొన్ని సీట్లను జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ప్రతిపాదిస్తున్నారుట.
జనసేనకు హైదరాబాద్ అర్బం ఏరియా దాని శివార్లతో పాటు నల్గొండ, ఖమ్మం లాంటి చోట్ల సీట్లు కావాలని కోరుతున్నటుగా ఉంది. అయితే ఒంటరిగా పోరు అని ఇప్పటిదాకా బీజేపీ భావిస్తోంది. మరి అంత మంది అభ్యర్ధులు ఆ పార్టీకి ఉన్నారా అన్నది పక్కన పెడితే మరో వైపు బీజేపీకి కూడా దక్షిణ తెలంగాణాలోనే కొంత పట్టు ఉంది. దాంతో జనసేన అక్కడే సీట్లు కోరితే తాము ఎలా ముందుకు సాగాలి అన్న ప్రశ్న ఒకటి తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు.
అదే విధంగా చూస్తే జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఎక్కడ తెలంగాణా సెంటిమెంట్ ని కేసీయార్ రాజేస్తారో అన్న భయం కూడా బీజేపీకి ఉంది అంటున్నారు. ఇక జనసేన మాత్రం గతంలోలా లేదు అంటున్నారు. పొత్తు లేకపోతే ఒంటరి పోరే అంటోంది. దాంతో బీజేపీకి ఇపుడు ఇది ప్రాణసంకటంగా మారుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.