బాబు అరెస్ట్.. అచ్చెన్నాయుడు ఆడియో లీక్, వైరల్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2023-09-10 07:16 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన న్యాయవాది, ప్రభుత్వ ఏజీ మధ్య సుదీర్ఘ వాదనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అచ్చెన్నాయుడు కి సంబంధించిన ఒక ఆడియో లీక్ అయింది. ఇది వైరల్ గా మారింది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టైన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

అందుకే ఆందోళనలూ జరగలేదో.. లేక, నిజంగానే చంద్రబాబు అరెస్టును లైట్ తీసుకున్నారొ తెలియదు కానీ... ఇలా జనం రోడ్లపై కనిపించకపోయేసరికి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తుంది. కనీసం ప్రస్తుతం చంద్రబాబు ఉన్న ఏసీబీ కోర్టు సమీపంలో అయినా భారీ సంఖ్యలో జనాలు పోగవ్వాలని స్థానిక టీడీపీ నేతలకు సూచించినట్లు తెలిసింది.

చంద్రబాబు అరెస్ట్‌ కు నిరసనగా కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం, ఆవేశం, ఆవేదన కలగలిపి వెళ్లగక్కుతున్నారు. వెంటనే జన సమీకరణ చేయాలంటూ విజయవాడ అర్బన్ నాయకులతో అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అయితే ఈ సమయంలో అచ్చెన్న టీడీపీ నేతలతో మాట్లాడిన టెలీ కాన్ఫరెన్స్‌ ఆడియో లీకైంది.

ఈ లీకైన ఆడియోలో ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది! పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలిచ్చారు. ఇందులో మరిముఖ్యంగా మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు సలహాలు ఇస్తున్నారు అచ్చెన్న.

బాబు అరెస్ట్‌ ను ప్రజలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందని, పార్టీకి ఇంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి లేదని, ఈ విషయాన్ని నాయకులు గ్రహించాలని, కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని.. కనీసం ఏసీబీ కోర్టు పరిశరాల్లో అయినా భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు.

ఇదే సమయంలో చాలా మంది బయట వ్యక్తులు తనకు ఫోన్ చేసి మరీ ఈ విషయంపై మాట్లాడారని తెలిపిన అచ్చెన్నాయుడు... పోలీసులు చేసుకునే పని పోలీసులు చేసుకుంటారు, మనం చేసే పని మనం చేయాలి, రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టాలన్నట్లుగా, అందుకు భారీగా జనసమీకరణ చేయాలని నాయకులను సూచించారు!

Full View
Tags:    

Similar News