ప్రమాణస్వీకార వేళ.. తెలుగు తమ్ముళ్లకు భారీ నిరాశ

దీంతో.. పాస్ ల మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశ ఎదురైన పరిస్థితి.

Update: 2024-06-21 04:11 GMT

అవును.. ఇది నిజం. ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడై.. కొత్త సర్కారు కొలువు తీరిన వేళ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారమహోత్సవం ఈ రోజు జరగనుంది. ఈ కార్యక్రమం ఏపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు.. బంధువులు.. సన్నిహితులు.. స్నేహితులకు భారీ షాక్ ను ఇస్తోంది. కారణం.. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని నేరుగా చూసే వీలు లేకపోవటమే దీనికి కారణం.

సాధారణంగా ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసే వేళలో.. తమకు అత్యంత ముఖ్యులైన వారిని తమతో తెచ్చుకోవటం.. వారిని గ్యాలరీల్లో ఉండటం.. ఒకవేళ గ్యాలరీలు నిండిపోతే.. కనీసం అసెంబ్లీ ప్రాంగణంలో ఉండేందుకు వీలుగా పాసులు జారీ చేస్తారు. అయితే.. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అదేమీ కుదరని పరిస్థితి. ఏపీ అసెంబ్లీలో సందర్శకులకు తగిన సీటింగ్ లేని కారణంగా.. ఎన్నికైన శాసన సభ్యుల కుటుంబ సభ్యులకు.. సందర్శకులకు పాస్ లు జారీ చేయకూడదన్న నిర్ణయాన్ని అధికారులు తీసుకుననారు.

దీంతో.. పాస్ ల మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశ ఎదురైన పరిస్థితి. వారే కాదు.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ఇదో షాకింగ్ గా మారిందంటున్నారు. పాస్ లు జారీ చేయని నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోనూ ఎవరూ ఉండేందుకు వీల్లేని పరిస్థితి. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో.. తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున అసెంబ్లీకి వచ్చి తమ అభిమాన నేతల ప్రమాణస్వీకార మహోత్సవాన్ని కళ్లారా వీక్షించాలని చాలానే ఆశించారు. వారి ఆశలు అడియాశలయ్యాయి.

Tags:    

Similar News