బొత్సకు గోల్డెన్ చాన్స్ ఇచ్చేస్తున్న టీడీపీ ?

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పంట పండుతోందా అంటే ఇప్పటివరకూ అయితే అదే నిజం అనుకోవాలి

Update: 2024-08-12 16:30 GMT

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పంట పండుతోందా అంటే ఇప్పటివరకూ అయితే అదే నిజం అనుకోవాలి. వైసీపీ చాలా రోజుల క్రితమే తన అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను నిలబెట్టింది. టీడీపీ అయితే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి కానీ ఎవరినీ తేల్చలేక పోయింది. మరి కొద్ది గంటలలో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తోంది.

అయినా సరే కూటమిలో ఇంకా ఎవరూ ఏమిటి అన్నది తేలలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల్లో 838 ఓట్లు ఉంటే అందులో అత్యధికం వైసీపీకే ఉన్నాయి. వైసీపీ ముందుగా అభ్యర్ధిని ప్రకటించడమే కాకుండా అలెర్ట్ అయింది. క్యాంప్ పాలిటిక్స్ ని సైతం స్టార్ట్ చేసింది.

మరో వైపు చూస్తే కూటమి ఆ సమయంలో ఎక్కడా సర్దుకోలేదు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల విషయం చూస్తే వైసీపీకి ఏకంగా 5 వందలకు పై చిలుకు ఓట్లు ఉన్నాయి. టీడీపీ కూటమికి 300 ఓట్ల దాకానే ఉన్నాయి. మరీ ఇంత పెద్ద తేడాతో ఎన్నికలకు వెళ్తే అనుకున్నది కాస్తా జరగకపోతే అభాసుపాలు అవుతామన్న బెంగ కూడా కూటమి పెద్దలలో ఉంది అని అంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ కూటమి మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. ఇక నామినేషన్ పర్వం ముగిసేందుకు వచ్చినా కూటమి ఏ డెసిషన్ తీసుకోలేకపోతోంది. మొదట మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ పీలా గోవింద సత్యనారాయణ వంటి వారి పేర్లు వినిపించినా చివరికి దిలీప్ చక్రవర్తి అనే పారిశ్రామికవేత్త పేరుని ప్రకటిస్తారని అంటున్నారు.

అయితే ఇది కూడా ఇంకా డౌట్ లోనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం తో నామినేషన్ దాఖలుకు గడువు ముగుస్తోంది. దీంతో అసలు టీడీపీ ఆలోచనలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. బలం లేకుండా పోటీ చేస్తోంది టీడీపీ అని వైసీపీ అదే పనిగా చేస్తున్న విమర్శలు కూడా కూటమిని ఒత్తిడిలోకి నెడుతున్నాయని అంటున్నారు.

అదే సమయంలో ఫిరాయింపులు పెద్ద ఎత్తున చేసి ఈ సీటు ఇపుడు గెలవడం అవసరమా అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రజలు కూటమికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. అందువల్ల ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటు వదిలేస్తే హుందాగా ఉంటుంది పైగా మెజారిటీ లేని వేళ రాజకీయ విన్యాసాలు చేయడం వల్ల జనంలో పలుచన అవుతామని అంటున్నారు.

ఇలా కూటమిలో తర్జన భర్జన జరుగుతుండడంతో అది వైసీపీకి ప్లస్ పాయింట్ అయినట్లుగా చెబుతున్నారు. వైసీపీ తరఫున పోటీకి దిగిన బొత్సకు లైన్ క్లియర్ అయినట్లేనా లేదా అన్నది మరి కొద్ది గంటలలో తేలిపోతుంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా బొత్స అయితే టీడీపీ కూటమి మీద హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. బలం లేకపోయినా పోటీ చేయడం పారిశ్రామికవేత్తలను తెచ్చి పోటీకి దించాలనుకోవడం చూస్తే రాజకీయం వ్యాపరంగా మారుస్తున్నారా అన్నది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇక కూటమిలో అయితే ఒక రకమైన సైలెన్స్ అయితే ఉంది. ఈ ఉప ఎన్నిక బరువు బాధ్యతలను మోసే పెద్ద తలకాయలు కూడా ముందుకు రాకపోవడంతో అనవసరం తల నొప్పులు అవసరమా అన్న చర్చ సైతం సాగుతోంది అని అంటున్నారు. దీంతో విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధులు నేతలతో చంద్రబాబు రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు. అయినా అభ్యర్థి ఎంపికలో గుంభనంగానే వ్యవహరిస్తున్నారు.

వైసీపీ బెంగళూరు కేంద్రంగా క్యాంప్ ని నిర్వహిస్తోంది. జగన్ అయితే జిల్లా పార్టీ నేతలతో వరసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తమ ఓటర్లను కాపాడుకుంటే కూటమి పోటీలోకి దిగినా విజయం తమదే అన్నది వైసీపీ వ్యూహంగా ఉంది. బొత్స సైతం నేరుగా తమ పార్టీ ఓటర్లతో మంతనాలు చేస్తూ మొత్తం పాజిటివ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ కూటమి బరిలో ఉంటుందా లేదా అన్నదే హై లెవెల్ టెన్షన్ గా మారింది.

Tags:    

Similar News