న్యూయార్క్ లో టీడీపీ జనసేన గోల

ఇటీవల న్యూయార్క్ లో టీడీపీ గెలుపు సంబరాలు జరిగాయి. వాటిని టీడీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున నిర్వహించారు

Update: 2024-06-28 14:20 GMT

ఇటీవల న్యూయార్క్ లో టీడీపీ గెలుపు సంబరాలు జరిగాయి. వాటిని టీడీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున నిర్వహించారు. వారికి చెందిన ఆర్గనైజేషన్ ద్వారా చేశారు. ఆ సంఘంలో ఎక్కువగా టీడీపీకి చెందిన సామాజిక వర్గం వారే ఉంటారు.

ఈ కార్యక్రమం బాగానే జరిగింది. అయితే ఆ కార్యక్రమంలో కొందరు మాట్లాడుతూ టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది అంటే ఆ క్రెడిట్ పూర్తిగా పవన్ కళ్యాణ్ దే అన్నట్లుగా మాట్లాడార అని టాక్. దాంతో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన వారు వెంటేనే దీన్ని ఖండించారు అని అంటున్నారు. చంద్రబాబు విజన్ ఆయన వ్యూహాలు వల్లనే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందని వారు గట్టిగానే వాదించారుట.

అయితే ఈ రచ్చ అక్కడితో ఆగలేదు. పవన్ కళ్యాణ్ కరడు కట్టిన అభిమాని అయితే పూర్తిగా లెక్కలు వేసి మరీ అంతా చూపించారుట. ఓటు షేర్ ఏ వైపు నుంచి ఏ వైపు మళ్లింది అన్నది ఆయన టేబుల్ వేసి ఫుల్ క్లారిటీతో చూపించడంతో పాటు పవన్ వల్లే ఇదంతా అని తన వాదనకు బలం చేకూర్చే ప్రయత్నం చేశారని టాక్

అయితే ఈ లెక్కలను అన్నింటినీ కొట్టి పారేస్తూ టీడీపీ వారు ఎక్కడా ఒప్పుకోలేదని అంటున్నారు. అంతే కాదు చంద్రబాబు వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పడంతో రభస ఒక చిన్నపాటి లెవెల్ లో సాగింది అని అంటున్నారు. అయితే ఆ ఆర్గనైజేషన్ లో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటంతో వారి మాటే చెల్లుబాటు అవుతుందని అంటున్నారు.

Read more!

జనసేనకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వారు ఆ సంఘంలో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి మాటలు వినపడకుండా చేస్తున్నారు అని అంటున్నారు. ఈ ఇద్దరినీ చూసిన మిగిలిన సామాజిక వర్గాల వారి విశ్లేషణ అయితే ఇలాగే ఉంది మరి. అయితే ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే వైసీపీ ఓటమి పాలు అయింది. అదే సమయంలో చంద్రబాబు పవన్ కష్టాన్ని ఎవరూ తక్కువ చేయాల్సిన అవసరం లేదు అని పెద్ద మనుషులు అయిన వారు అంటున్నారు.

ఈ కులాల గొడవ ఏంది అని కూడా వారు విసుక్కుంటున్నారుట. ఇక ఈ సంఘంలో ఉన్న వారు అంతా అత్యధిక విద్యను అభ్యసించిన విద్యావంతులు. అంతే కాదు ఎక్కువ మంది డాక్టర్లు కూడా ఉన్నారుట. అయినా సరే ఈ కులాల గోల ఏంటి అని అంటున్నారుట. ఈ కులాల లొల్లి అవసరమా అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. అంతా వేరే దేశానికి వచ్చి బతుకుతూ కూడా కులాల జాడ్యాన్ని వదిలించుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు.

ఒక తెలుగు ఆర్గనైజేషన్ వాళ్ళను పిలిచి వారికి టీడీపీ కండువాలు వేస్తూంటే వారు రిజెక్ట్ చేశారు అని అంటున్నారు. కండువాలు కాదు ప్రభుత్వం బాగా పనిచేయాలన్నదే తమ భావన అని వారు అంటున్నారుట. తాము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తూంటే ఈ పార్టీ కండువాలు ఏంటి అని చాలా మంది పెద్దలు చికాకు పడినట్లుగా తెలుస్తోంది.

అయినా ఏపీలో ప్రభుత్వం వచ్చింది. అయిదేళ్ళ పాటు పనిచేయడానికి మాండేట్ ఇచ్చారు. ఇక క్రెడిట్ ఎవరిది అంటే అది రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. అయినా ఎవరు కలసినా విడిపోయినా ప్రజలు తీర్పు ఇవ్వాలనుకుని ఇచ్చారు కాబట్టి వారిదే క్రెడిట్ అని అంటున్నారు. అలాంటిది ఎన్నికలు ముగిసాక ప్రభుత్వాలు బాగా పనిచేయాలని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఏపీ అక్షర క్రమంలో ముందుకు సాగాలని కోరుకోవాలి

కానీ ఈ రకంగా కులాల సంకుల సమరం దేశం కాని దేశంలో అవసరమా అన్న ప్రశ్నలు కూడా మేధావులు వేస్తున్నారు. కులాలు లేని సమాజం కోరుకోవాలి. మనిషి ఆ ఊబి నుంచి బయటకు వచ్చి విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాక కూడా ఇంకా కులాల సంకెళ్ళు తగిలించుకోవడం వల్ల తాను తగ్గిపోతున్నాను అని ఎందుకు భావించడం లేదు అంటున్నారు. అంతే కాదు తాము అభిమానిస్తున్న పార్టీని కూడా ఇతర వర్గాల నుంచి కావాలని దూరం చేస్తున్నామన్న ఆలోచన కూడా లేకపోతే ఎలా అని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీ గెలిచినా అన్ని వర్గాల అండదండలు ఉంటేనే సాధ్యపడుతుంది అన్నది కూడా అంతా గుర్తెరగాలి అని అంటున్నారు.

Tags:    

Similar News

eac