దేశంలో 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు ఎంతమందో తెలుసా?
అవును... తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అర్హుల సంఖ్యను వెళ్లడించింది.
ఒక తెలుగు సినిమాలో రాజకీయ నాయకుడు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పే డైలాగ్.. "మీరు అవునన్న వాడు మంత్రి.. కాదన్నవాడు కంత్రి!" అని! అంటే... నాయకుడి భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంటుందని.. అది ఒక్కసారిగా నాయకుడిని ఆకాశానికి ఎత్తేస్తుంది.. లేదా, పాతాళానికీ తొక్కేసుందని అర్ధం కావొచ్చు! ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్యను తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పుడు వీరి చేసిలోనే నేతల రాతలు ఉండబోతున్నాయి.
అవును... తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అర్హుల సంఖ్యను వెళ్లడించింది. ఇదే సమయంలో వీరిలో సుమారుగా సగంమంది మహిళలు ఉండటం గమనార్హం. భారతదేశం ఎంత పెద్ద ప్రజాస్వామ్య దేశమో ఈ సంఖ్య చెబుతుంది. ఇదే సమయంలో... భారతదేశంలో భారీ సంఖ్యలో ఉన్న టీనేజర్స్ వివరాలను కూడా వెళ్లడించింది. ఇదే సమయంలో వీలైనంత ఎక్కువ శాతం పోలింగ్ నమోదవ్వాలని కోరుకుంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లకు సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిషన్ గణాంకాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... రానున్న లోక్ సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు కాగా... వారిలో సుమారు 47 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అంటే... దాదాపు సగం మంది మహిళలు ఈదఫా తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారన్నమాట.
ఇదే సమయంలో... ఓటు వేసేందుకు కొత్తగా అర్హులైన వారిలో సుమారు 1.73 కోట్ల మంది 18-19 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. ఈ క్రమంలో రాబోయే లోక్ సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, ఇదే సమయంలో సుమారు 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బందిని నియమించనున్నారని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ క్రమంలో... ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. దేశంలో 1951లో 17.32 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉండగా.. 2019 నాటికి వారి సంఖ్య 91.20 కోట్లకు చేరింది. ఇక.. తొలి లోక్ సభ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదు కాగా.. గత పార్లమెంటు ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో... కొత్త ఓటర్లు, యువ ఓటర్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో... ఈసారి ఈ పోలింగ్ శాతం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటుండగా.. భారీగా పెరగాలని పలువురు కోరుకుంటున్నారు.
కాగా... ఆంధ్రప్రదేశ్ లో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256 ఉండగా... వీరిలో పురుష ఓటర్లు 2,09,00,275 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2,07,37,0655. ఇక.. థర్డ్ జెండర్ ఓట్ల సంఖ్య 3482 గా ఉండగా... సర్వీస్ ఓటర్ల సంఖ్య 67,434 గా ఉంది!