హాట్ టాపిక్... తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

అవును... ఇప్పటివరకూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణలో బీఆరెస్స్, కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ పోటీ తప్పదని తెలుస్తుంది

Update: 2023-11-30 13:56 GMT

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది! దీంతో... వాటి తుది ఫలితాలు వెలువడేలోపు మధ్యలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై అంచనాలు అందరిలో ఆసక్తి కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకూ అందుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని చెబుతుండటం గమనార్హం!

అవును... ఇప్పటివరకూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణలో బీఆరెస్స్, కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ పోటీ తప్పదని తెలుస్తుంది. ఈ సమయంలో మూడు ప్రధాన పార్టీలు కాకుండా ఉండే ఇతరుల సీట్లు కీలకంగా మారబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు ఆయా సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం!

జన్‌ కీబాత్‌ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ – బీఆరెస్స్ ల మధ్య హోరా హోరీ పోరు తప్పదని తెలుస్తుంది. ఈ ఫలితాల ప్రకారం...

బీఆరెస్స్: 40 - 55

కాంగ్రెస్: 48 - 64

బీజేపీ: 7 - 13

ఎంఐఎం: 4 – 7

సీ.ఎన్.ఎన్. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా బీఆరెస్స్ - కాంగ్రెస్ మధ్య కాస్త టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందనే తెలుస్తుంది. వీటి ప్రకరం...

బీఆరెస్స్: 40 - 55

కాంగ్రెస్: 48 - 64

బీజేపీకి: 7 - 13

ఎంఐఎం: 4 - 7

ఇతరులు: 0-1

ఆరా సంస్థ ఇచ్చిన ఫలితాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలను సాధించే అవకాశం ఉంది! ఈ ఫలితాల ప్రకారం...

బీఆరెస్స్: 41 - 49

కాంగ్రెస్: 58 - 67

బీజేపీ: 5 - 7

ఇతరులు: 7 – 9

ఇండియా టీవీ - సీ.ఎన్.ఎక్స్ సర్వే ప్రకారం కూడా కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ని దాటే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఫలితాల ప్రకారం...

బీఆరెస్స్: 31 - 47

కాంగ్రెస్: 63 - 79

బీజేపీ: 2 - 4

ఎంఐఎం: 5 – 7

సీపీఎస్ ఫలితాల ప్రకారం బీఆరెస్స్ కు మ్యాజిక్ ఫిగర్ పక్కా అని తెలుస్తుంది. ఈ ఫలితాల ప్రకారం...

బీఆరెస్స్: 72 (+/-6)

కాంగ్రెస్: 36 (+/-5)

బీజేపీ: 01 - 03

ఇతరులు:7 – 9

ఇదే సమయంలో పోల్ స్టార్ట్ ఇచ్చిన సర్వే ప్రకారం బీఆరెస్స్ - కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ తప్పదని తెలుస్తుంది. ఈ ఫలితాల ప్రకారం...

బీఆరెస్స్: 48 - 58

కాంగ్రెస్: 49 - 56

బీజేపీ: 5 - 10

ఎంఐఎం: 6 - 7

అదేవిధంగా... పీటీఎస్ గ్రూప్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కూడా కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఫలితాల ప్రకారం ...

బీఆరెస్స్: 35 – 40 (+/- 5)

కాంగ్రెస్: 65 – 68 (+/-5)

బీజేపీ: 7 – 10 (+/-3)

ఎంఐఎం: 6 – 7

ఇతరులు: 1 – 2 స్థానాలూ వచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.

ఓవరాల్ గా ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు హంగ్ ప్రభుత్వ ఏర్పాటును కూడా కొట్టిపారేయలేమనే చర్చ తెరపైకి వచ్చింది!

Tags:    

Similar News