కేసీయార్-పీకే భేటీ జరిగిందా ?
సమయం మించిపోయిందని ఇపుడు తాను చెప్పే వ్యూహాలు ఏవీ పనిచేయమని పీకే కచ్చితంగా కేసీయార్ కు చెప్పేశారట
పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో ఒక కీలకమైన పరిణామం జరిగిందట. అదేమిటంటే కేసీయార్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య సుదీర్ఘమైన భేటీ జరిగిందని మరో వ్యూహకర్త గురురాజ్ అంజన్ ట్వీట్లో చెప్పారు. భేటీ అంటే నేరుగా ఇద్దరు కలుసుకోలేదు. ఎన్నికల్లో గెలుపుకోసం ఎదురీదుతున్న కేసీయార్ నుండి పీకేకి ఫోన్ వచ్చిందని గురురాజ్ చెప్పారు. వీళ్ళిద్దరు దాదాపు మూడు గంటలపాటు ఎన్నికలపైనే మాట్లాడుకున్నారని గురురాజ్ ట్వీట్లో చెబితేనే అందరికీ విషయం తెలిసింది.
నిజానికి పీకే వ్యూహాలు నచ్చకే అర్ధాంతరంగా కేసీయార్ కాంట్రాక్టును టెర్మినేట్ చేసుకున్నారు. తనకు రాజకీయ వ్యూహాలు అవసరంలేదని పీకేకి చెప్పేసి పంపించేశారు. అలాంటిది పోలింగుకు మరో వారంరోజులు మాత్రమే గ్యాప్ ఉన్న సమయంలో కేసీయార్ ఎందుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ? ఎందుకంటే ఓటమి బయం కేసీయార్లో స్పష్టంగా తెలుస్తోందనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. ఎన్నికల్లో బయటపడే మార్గాన్ని కేసీయార్ అడిగితే పీకే తాను ఇపుడు ఏమిచేయాలనని బదులిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
సమయం మించిపోయిందని ఇపుడు తాను చెప్పే వ్యూహాలు ఏవీ పనిచేయమని పీకే కచ్చితంగా కేసీయార్ కు చెప్పేశారట. బీఆర్ఎస్ ను జనాలు నమ్మటంలేదని, ఇపుడు ఏమిచేసినా వర్కవుట్ కాదని కూడా అన్నారట. అందుకనే ఇపుడు కనీసం గౌరవప్రదమైన స్ధానాలైనా గెలుచుకునే ప్లానులో కేసీయార్ ఉన్నారనే ప్రచారం పార్టీలోనే పెరిగిపోతోంది. ఈమధ్యనే ఫ్లాష్ సర్వే పేరుతో తాను చేయించిన సర్వే రిపోర్టును కేసీయార్ కు పీకే అందించారట. పైకి మాత్రం హ్యాట్రిక్ పక్కా అని కేసీయార్ అండ్ కో చెబుతున్నా వాస్తవం ఏమిటన్నది వాళ్ళకు కూడా అర్ధమైపోయిందట.
అందుకనే చివరి అవకాశంగా పీకే జోక్యాన్ని కేసీయార్ కోరినట్లు పార్టీలో టాక్ పెరిగిపోతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ లో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో 80 సీట్లకు తగ్గకుండా వస్తాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అందుకనే డిసెంబర్ 9వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం ముహూర్తాన్ని కూడా రేవంత్ ఫిక్స్ చేసుకున్నారు. ప్రతిపక్షాలపైన ముఖ్యంగా కాంగ్రెస్ పైన కేసీయార్ మైండ్ గేమ్ కూడా వర్కవుట్ కాకపోవటంతోనే టెన్షన్ పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.