పెండింగ్ ట్రాఫిక్ చలానాలు ఉన్నాయా? పండుగ చేసుకోండి
అంచనాలు నిజమయ్యాయి. భారీగా పేరుకు పోయిన పెండింగ్ చలానాల్ని క్లియర్ చేసుకునేందుకు వీలుగా రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది
అంచనాలు నిజమయ్యాయి. భారీగా పేరుకు పోయిన పెండింగ్ చలానాల్ని క్లియర్ చేసుకునేందుకు వీలుగా రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి విధించిన చలానాల్ని క్లియర్ చేసే విషయంలో పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలానాల్ని క్లియర్ చేసుకునేందుకు వీలుగా భారీ రాయితీతో ఆఫర్ ను ప్రకటిస్తూ తాజాగా జీవో విడుదల చేశారు.
కొవిడ్ తో పాటు ఇతర కారణాల నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలానాల్ని క్లియర్ చేసేందుకు వీలుగా ఈ రాయితీ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొందరికి వారికున్న టూవీలర్ల ధర కంటే ఆ వాహనం మీద ఉన్న చలానాలు భారీగా ఉన్న పరిస్థితి. ఇలాంటి వారంతా తమ పెండింగ్ చలానాల్ని అతి తక్కువ మొత్తంలో క్లియర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణక్ష్ం తీసుకున్నారు.
టూవీలర్లు.. ఆటోలకు 80 శాతం రాయితీతో.. టీఎస్ ఆర్టీసీ బస్సులకు 90 శాతం.. కార్లు.. ఇతర వాహనాలపై విధించిన చాలానాలకు 60 శాతం రాయితీతో పెండింగ్ చలానాలు కట్టేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక అంచనా ప్రకారం దాదాపు రూ.300 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని ఆశిస్తున్నారు. కరోనా అనంతరం ఇలాంటి పథకాన్నే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ రాయితీ సౌకర్యంతో పెండింగ్ ట్రాఫిక్ చలానాల్ని క్లియర్ చేసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిమిత కాలానికి మాత్రమే ఉండే ఈ రాయితీని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు.