సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడు మృతి.. కారణం అత్యంత ఘోరం!
ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని కరీంనగర్ కు చెందిన 27 ఏళ్ల మహమద్ షాదాజ్ ఖాన్ గా గురించారు!
బ్రతుకుదెరువు కోసం సౌదీ వెళ్లి.. అక్కడ పని మీద బయటకు వెళ్లి.. దారి తప్పి ఎడారిలోకి చేరి.. గొంతు ఎండిపోవడంతో ఓ తెలంగాణ యువకుడు మృతిచెందిన అత్యంత విషాదకరమైన వార్త తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని కరీంనగర్ కు చెందిన 27 ఏళ్ల మహమద్ షాదాజ్ ఖాన్ గా గురించారు!
అవును... తూర్పు ఫ్రావిన్స్ లోని రబ్ అల్ ఖాలీ అని పిలవబడే సౌదీ అరేబియాలోని విశాలమైన దక్షిణ ఎడారిలో దారితప్పి, మండుతున్న ఎండలో డీహైడ్రేషన్ కు లోనై అలసటతో తెలంగాణకు చెందిన వ్యక్తి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇతడితో పాటు ఇతడి కొలీగ్ మృతదేహం ఇసుక తిన్నెలపై ఉన్న ప్రార్థన రగ్గుపై కనిపించిందని చెబుతున్నారు.
ఖాన్... జీపీఎస్ సిగ్నల్ ను కోల్పోయిన అనంతరం మొబైల్ ఫోన్ బ్యాటరీ కూడా అయిపోయిందంట. ఇదే సమయంలో కారులో ఇందనం కూడా అయిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దారితప్పి సుమారు నాలుగు రోజుల పాటు ఎడారిలోనే చిక్కుకుపోవడంతో ఈ విషాదకర ఘటన సంభవించిందని చెబుతున్నారు.
ఈ సమయంలో ప్రార్థన రగ్గుపై మృతదేహాలు పడి ఉండటం అనేది హృదయాలను కదిలించే దృశ్యంగానే చెప్పాలి. బ్రతుకుపై ఆశ కోల్పోయిన వారు చనిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో చివరిగా ప్రార్థనలు చేసి ఉంటారని ఆ దృశ్యం సూచిస్తుంది! ఖాన్.. గత మూడు సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో టెలీకమ్యునికేషన్స్ మెయింటెనెన్స్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.