విశ్వ గురువుకు అగ్ని పరీక్ష.. పార్లమెంటును రక్షించుకోలేరా
అయితే.. ఇది జరిగి రెండు రోజులు కూడా కాకముందే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు భారత్ పరువు పోయిన ట్టయింది.
విశ్వగురువుగా తనను తాను కీర్తించుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ప్రపంచ దేశాలన్నీ కూడా.. తన కు తీసిపోతాయనే చెబుతారు. తనను మించిన నాయకుడు లేరని కూడా భుజకీర్తుల తొడిగించు కుంటారు. అంతేకాదు.. మొన్నటికి మొన్న.. పార్లమెంటులో చర్చ సందర్భంగా తమ హయాంలో ఉగ్రదాడులు, తీవ్ర వాదుల దాడులు కూడా తగ్గిపోయాయని ప్రధాని మోడీ కీర్తనలు పార్లమెంటులో పెచ్చరిల్లాయి.
అయితే.. ఇది జరిగి రెండు రోజులు కూడా కాకముందే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు భారత్ పరువు పోయిన ట్టయింది. ఇద్దరు ఆగంతుకులను కూడా గుర్తు పట్టలేనంత, గుర్తించలేనంత బలహీనంగా నూనత పార్లమెం టును నిర్మించారా? అంటూ.. విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు ఆగంతకులు.. పార్లమెంటు గ్యాలెరీలోకి యథేచ్ఛగా రావడం.. వారి కాలి బూట్లలో టియర్ గ్యాస్ యంత్రాలు అమర్చుకోవడం గమనార్హం.
వచ్చీరావడంతోనే సభ మంచి చర్చాసమయంలో ఉండగా.. ఒక్కసారిగా సభలోకి దూకి.. టియర్ గ్యాస్‌ను వదిలి తీవ్ర గందరగోళం, భయోత్పాతమే సృష్టించారు. మరి ఇంత జరగడానికి కారణం ఏంటి? వాస్తవానికి నేరుగా ఒక మీడియా రిపోర్టర్‌ను సైతం పార్లమెంటు భద్రతా బలగాలు అనుమతించవు. పైగా నూతన పార్లమెంటులో అనుమతి లేకుండా ఈగ కూడా రాదు.
అలాంటి అతి పెద్ద, అత్యంత పెద్ద భద్రత ఉన్న భవంతిలో .. మూడు వేల మంది పోలీసులు.. 20 ట్రూపుల సీఆర్ పీఎఫ్ రక్షణలో ఉన్న భవంతిలో ఇద్దరు ఆగంతకులు భయోత్పాతం సృష్టించారంటే.. ఇది మోడీకి అవమాన కరం కాదా? భారత పార్లమెంటు భద్రతకు రక్షణ ఉన్నట్టా? లేనట్టా.. ? అనే ప్రశ్నలు వస్తున్నా యి. ఇప్పుడు టియర్ గ్యాస్ కాబట్టి కొంత వరకు నయమే అనుకున్నా.. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే.. ఏంటి? పరిస్థితి ? విశ్వగురువు దీనిని చిన్నవిషయంగా తీసుకుంటారా? చూడాలి.