ప్రణీత్ హనుమంతు వ్యవహారంలో టీజీ పోలీస్ కీలక నిర్ణయం!
ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలకు ఆదేశించారు. దీంతో... ఇతడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరిచి మాట్లాడాడు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు! పూర్తిగా సంస్కారం మరిచి, విజ్ఞత విడిచి అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. తండ్రీ కుమార్తె బంధంలో కూడా అశ్లీలం ధ్వనించేటంత పైత్యం కలిగి మాట్లాడాడు. ఇతడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతుందని అంటున్నారు. టీజీ పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారని తెలుస్తుంది.
అవును... సంస్కారం, విజ్ఞత మరిచినట్లుగా తండ్రీ కూతుళ్లపై అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు! ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై సినీ నటుడు సాయిధరం తేజ్, మంచు మనోజ్ లు ఎక్స్ వేదికగా స్పందించారు! ఇలాంటి వారిపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ట్యాగ్ చేశారు.
ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలకు ఆదేశించారు. దీంతో... ఇతడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో నిందితులు ఏపీకి చెందినవారిగా గుర్తించారని అంటున్నారు. వారిలో ఒకరైన ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు నిర్థారించారని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న ప్రణీత్ తో పాటు ఆ వీడియోలో ఉన్న బ్యాచ్ మొత్తాన్ని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఇదే సమయంలో వారిపై తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు! ఈ వ్యవహారంపై స్పందించిన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.