హనుమంతుడ్ని పిటిషనర్ గా చూపినోడికి కోర్టు ఫైన్ పంచ్

అక్కడితో ఆగకుండా అతి తెలివి ప్రదర్శించినందుకు ఫైన్ పంచ్ విసిరింది.

Update: 2024-05-08 09:30 GMT

తెలివి ఫర్లేదు. కానీ.. అతి తెలివితో వ్యవహరించే వారితోనే కష్టం. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించిన ఒకడికి కోర్టు భారీ షాకిచ్చింది. వాళ్లు.. వీళ్లు కాకుండా ఏకంగా భగవంతుడిగా ఆరాధించే హనుమంతుడు (ఆంజనేయస్వామి)ని తోటి కక్షిదారుగా చూపించిన అతితెలివి వ్యక్తిపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అక్కడితో ఆగకుండా అతి తెలివి ప్రదర్శించినందుకు ఫైన్ పంచ్ విసిరింది.

అసలేం జరిగిందంటే.. దేవాలయం ఉన్న ఒక ప్రైవేటు భూమిని సొంతం చేసుకోవాలని ఒక వ్యక్తి ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా హనుమంతుడ్ని తన తోటి పిటిషనర్ గా పేర్కొన్నారు. ఈ భూమి హనుమంతుడిదని.. అది ఆయనకే చెందుతుందని చెప్పిన సదరు పిటిషనర్.. హనుమంతుడిని కొలిచే ఒక భక్తుడిగా.. ఒక స్నేహితుడిగా ఆ భూమిని సంరక్షించేందుకు వీలుగా తనకు ఆ భూమిని కేటాయించాలంటూ అతి తెలివి మొత్తాన్ని రంగరించి పిటిషన్న రూపంలో కోర్టులో దాఖలు చేశారు.

పిటిషనర్ తీరును గుర్తించిన కోర్టు.. విచారణ జరిపిన సందర్భంగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తప్పుడు మార్గంలో ఆస్తిని సొంతం చేసుకోవటానికి కక్షిదారు పిటిషన్ దాఖలు చేసినట్లుగా గుర్తించిన ధర్మాసనం సదరు వ్యక్తికి భారీ పంచ్ విసిరింది. ఈ కేసును కొట్టేసిన కోర్టు.. పిటిషనర్ కు రూ.లక్ష ఫైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ కట్టే రూ.లక్ష మొత్తాన్ని ప్రస్తుతం ఆ భూముల్ని చూసుకునే వారికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు వ్యవహారం అందరిని ఆకర్షిస్తోంది.

Tags:    

Similar News